క్రీడాభూమి

మంచి నీళ్లకు ఇబ్బంది పడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్‌లో పోటీపడినప్పుడు భారత అధికారులు ఎవరూ స్టాళ్లలో కనిపించలేదని, తనకు మంచి నీరు ఇచ్చేవారు కూడా కరవయ్యారని ఒపి జైష చేసిన ఆరోపణలకు భిన్నంగా మరో మారథాన్ రన్నర్ కవిత రావత్ స్పందించింది. ఏ దశలోనూ మంచినీళ్లకు తాను ఇబ్బంది పడలేదని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. రేస్‌కు ముందు భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధికారులు ప్రత్యేకమైన డ్రింక్స్ ఎవైనా అవసరమా అని అడిగినట్టు చెప్పింది. తాను వద్దన్నానని, స్టాల్స్ ఎక్కడ ఉన్నాయనే విషయం తనకు తెలియదుగానీ, మంచి నీటికి తాను ఇబ్బంది పడలేదని స్పష్టం చేసింది. జైష ఆరోపణలపై స్పందించడానికి ఆమె నిరాకరించింది. ఆ వివాదంలో తలదూర్చబోనని అన్నది. తన విషయం మాత్రమే తాను చెప్పగలుగతానని, మిగతా విషయాల గురించి మాట్లాడబోనని తెలిపింది.