క్రీడాభూమి

టోక్యో చేరిన ఒలింపిక్స్ పతాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, ఆగస్టు 24: రియో ఒలింపిక్స్‌కు తెరపడిందో లేదో టోక్యోలో సందడి మొదలైంది. 2020 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న ఈ నగరానికి బుధవారం ఒలింపిక్ పతాకం చేరుకోవడంతో హడావుడి ప్రారంభమైంది. నిర్వాహకులు ఇప్పటి నుంచి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా, ఒలింపిక్ పతాకం టోక్యో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర గవర్నర్ యురికో కొయికే పాల్గొన్నారు. అధికారికంగా పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆమె మాట్లాడుతూ రియో ఒలింపిక్స్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడాన్ని అధికారులు పాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రియోలో నిర్వాహకులకు ఎదురైన పరిస్థితి తమకు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 1964 తర్వాత టోక్యోకు మళ్లీ ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని చెప్పింది. జపాన్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి రుజువు చేస్తామని టోక్యో తొలి మహిళా మేయర్‌గా రికార్డు సృష్టించిన కొయికే ధీమా వ్యక్తం చేసింది. అంచనా వ్యయానికి, వాస్తవ పరిస్థితులకూ ఎక్కడా పొంతన ఉండదని, కాబట్టి ముందుగానే సరైన వ్యూహాలను సిద్ధం చేసుకొని ముందుకు వెళతామని తెలిపింది. టోక్యోలో 32వ ఒలింపిక్స్ ఘన విజయం అవుతాయని జోస్యం చెప్పింది.
ఒలింపిక్స్ నిర్వాహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సహజంగా ఆతిథ్య నగరంలోని ప్రజలపై ఆ భారం పడుతుంది. దేశ ఖజానా నుంచి కూడా భారీగా సొమ్ము ఖర్చవుతుంది. వౌలిక వసతులను తుంగలోతొక్కి, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం వంటి విషమ పరిస్థితులను విస్మరించి ఒలింపిక్స్‌ను నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ రియోలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, వైద్యులు, లాయర్లు చివరికి పోలీసులు కూడా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. విశ్వ క్రీడలకు ఆతిథ్యమిచ్చామన్న ఆనందంకంటే, ప్రపంచ దేశాల ముందు తలవంచుకోవాల్సి వచ్చినందుకు బాధే బ్రెజిల్‌కు ఎక్కువైంది. అంచనా వ్యయానికి రెట్టింపు మొత్తంలో ఖర్చు కావడంతో బ్రెజిల్ సర్కారు బెంబేలెత్తిపోయింది. అతి కష్టం మీద ఒలింపిక్స్‌ను ముగించినా, భారీ నష్టం నుంచి కోలుకోవడానికి కనీసం దశాబ్దకాలం పడుతుంది. ఒలింపిక్స్‌కు ముందు, ఆతర్వాత బ్రెజిల్ పరిస్థితి తెరచిన పుస్తకం కావడంతో, జపాన్ ముందు అన్ని విధాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఒలింపిక్స్ నిర్వాహణ భారం టోక్యో ప్రజల మీద ఎక్కువగా పడకుండా చూసేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నది. అదే విధంగా ప్రజాధనం ఎక్కువ ఖర్చు కాకుండా ఒలింపిక్స్ ఖర్చులను ప్రైవేటు కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు పంచాలన్న ఆలోచన కూడా జపాన్ సర్కారుకు ఉంది. మొత్తం మీద బ్రెజిల్ పరిస్థితి తమకు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో జపాన్ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది.