క్రీడాభూమి

ప్రక్షాళనే లక్ష్యంగా ‘లోధా’ సిఫార్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళనే లక్ష్యంగా విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక సిఫార్సులు చేసింది. పలు వివాదాల్లో మునిగితేలుతున్న బిసిసిఐని 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో తెరపైకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు మరింత ఇరకాటంలోకి నెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసును విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నాయకత్వంలోని కమిటీ రెండు విడతలుగా విచారించి సుప్రీం కోర్టుకు నివేదికలను అందించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలను దోషులుగా తేల్చింది. స్పాట్ ఫిక్సింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ ఉదాసీనంగా వ్యవహరించిన చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను తప్పుపట్టింది. దోషులను గుర్తించినప్పటికీ, వారికి శిక్షను ఖరారు చేసే బాధ్యతను ఆర్‌ఎం లోధా నాయకత్వంలో అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించింది. అంతేగాక, బిసిసిఐ పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సిందిగా కమిటీని కోరింది. పలు కోణాల్లో కేసును అధ్యయనం చేసి, ఎంతో మందిని విచారించిన తర్వాత, గురునాథ్ మెయప్పన్, రాజ్ కుంద్రాలపై జీవితకాల సస్పెన్షన్ వేటు వేసింది. చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను రెండు సంవత్సరాలు ఐపిఎల్‌లో ఆడకుండా నిషేధించింది. అనంతరం బిసిసిఐలో అనుసరించాల్సిన విధివిధానాలపై దృష్టి సారించింది. బోర్డు అధికారులతో 38 పర్యాయాలు సుమావేశమైంది. ఇప్పటి వరకూ బోర్డుపై ఉన్న పలు ఆరోపణలు, విమర్శలను పరిగణలోకి తీసుకొని, వాటిని విశే్లషించి సిద్ధం చేసిన 159 పేజీల నివేదికను సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది.
గరిష్టంగా మూడుసార్లు..
ఒక వ్యక్తి బిసిసిఐ పాలక మండలికి గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చని, అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉండకూడదని నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందని లోధా తెలిపారు. పాలక మండలి మూడేళ్లు పదవిలో ఉండవచ్చని అన్నారు. అయితే, అధ్యక్షుడు రెండుసార్లు, మిగతా కార్యవర్గ సభ్యులు వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే అధికంగా పదవిలో కొనసాగేందుకు వీలులేదని వివరించారు. తాము చేసిన సూచనల్లో ఇది అత్యంత కీలకమైనదని అన్నారు.
ఒక రాష్ట్రానికి ఒకే సంఘం
బిసిసిఐ నిర్మాణం, నియమ నిబంధనలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలను చేసినట్టు సోమవారం కిక్కిరిసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్రాంతి న్యాయమూర్తి లోధా తెలిపారు. బోర్డులో 30 యూనిట్లకు సభ్యత్వం ఉందని, అయితే, సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేవని చెప్పారు. అదే విధంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలకు బిసిసిఐలో సభ్యత్వం ఉందన్నారు. ఈ విధమైన అసమానతలను తొలగించి, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంఘం మాత్రమే ఉండాలని తాము సిఫార్సు చేశామని లోధా వివరించారు.
ఆర్‌టిఐ పరిధిలోకి రావాలి
బిసిసిఐ కార్యకలాపాల్లో ఎక్కువ శాతం ప్రజలకు సంబంధించిన అంశాలతోనే ముడిపడి ఉంటాయని లోధా అన్నారు. కాబట్టి బోర్డులో ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. తమిళనాడులో స్వచ్ఛంద సంస్థగా నమోదైనందున తమ కార్యకలాపాలు లేదా పాలనా వ్యవహారాలను గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదని బిసిసిఐ చాలాకాలంగా వాదిస్తున్నది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి బోర్డును తీసుకురావడానికి గతంలో చాలా సందర్భాల్లో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. ఇదే విషయంపై లోధా కమిటీ దృష్టి సారించిం ది. క్రికెట్‌పై ప్రజలకు ఉన్న ఆ దరణ వల్లే బిసిసిఐ ఎదిగింద ని, ఆర్థికంగా స్థిరపడిందని లో ధా విలేఖరుల సమావేశంలో తెలిపారు. అందుకే, బోర్డును ఆర్టీఏ పరిధిలోకి చేర్చాలని సూచించినట్టు చెప్పారు.
ఆటగాళ్లకు ఓ సంఘం
క్రికెటర్లకు ఒక సంఘాన్ని బిసిసిఐ ఏర్పాటు చేయాలని తాము సిఫార్సు చేశామని లోధా తెలిపారు. ఇందుకోసం మాజీ హోం కార్యదర్శి జికె పిళ్లై అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీని నియమించాలని అన్నారు. ఈ కమిటీలో మాజీ కెప్టెన్లు మొహీందర్ అమర్‌నాథ్, అనీల్ కుంబ్లే, మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీలను సభ్యులుగా చేర్చాలని ప్రతిపాదించినట్టు లోధా వివరించారు. పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరికీ క్రికెటర్ల సంఘంలో సభ్యత్వాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ సంఘం బిసిసిఐ ఆర్థిక సాయంతో నడుస్తుందని తెలిపారు. అంత మాత్రం చేత బోర్డుకు లోబడి వ్యవహరించాల్సిన అవసరం లేదని, తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు వారికి ఉంటుందని అన్నారు.
ఐపిఎల్‌కు ప్రత్యేక గవర్నింగ్ బాడీ
ఐపిఎల్‌కు ప్రత్యేక గవర్నింగ్ బాడీ ఉండాలన్నది తాము చేసిన కీలక సూచనల్లో ఒకటని లోధా తెలిపారు. తొమ్మిది మందితో ఐపిఎల్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని అన్నారు. బిసిసిఐ కార్యదర్శి, కోశాధికారి ఈ బాడీలో సభ్యులుగా ఉంటారని వివరించారు. ఇద్దరు సభ్యులను బిసిసిఐ సభ్య సంఘాలు ఎన్నుకుంటాయని, ఇద్దరు ఫ్రాంచైజీ ప్రతినిధులు ఉంటారని లోధా చెప్పారు. క్రికెటర్ల సంఘం నుంచి ఒక ప్రతినిధి కూడా ఐపిఎల్ గవర్నింగ్ బాడీలో ఉంటాయని అన్నారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒకరిని నియమిస్తారని తెలిపారు. ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం ఐపిఎల్ గవర్నింగ్ బాడీకి ఉంటుందని అన్నారు. అయితే, బిసిసిఐకి జవాబుదారీ వహించాలన్నారు.

9 మందితో కార్యవర్గం
బిసిసిఐ పాలక మండలి తొమ్మిది మందితో ఏర్పాటు కావాలని సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో సూచించినట్టు లోధా తెలిపారు. వీరిలో ఐదుగురిని బోర్డు సర్వసభ్య సమావేశం ఎన్నుకుంటుందని, ఇద్దరు క్రికెటర్ల ప్రతినిధులు ఉండాలని సూచించారు. ఒక మహిళకు కూడా స్థానం కల్పించాలన్నారు. బోర్డు రోజువారీ వ్యవహారాలను పరిశీలించే బాధ్యతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో)కు అప్పగించాలని పేర్కొన్నారు. అతనికి ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ సహాయసహకారాలు అందించాలని అన్నారు.

మంత్రులకు నో ఎంట్రీ
మంత్రలు ఎవరూ బిసిసిఐ పాలక మండలిలో సభ్యులుగా ఉండరాదని సూచించినట్టు లోధా తెలిపారు. బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర పోస్టులకు ఎన్నికయ్యే వ్యక్తులకు కొన్ని స్పష్టమైన అర్హతలు ఉండాలని తమ నివేదికలో పేర్కొన్నామని అన్నారు. ఈ పోస్టుల్లో సేవలు అందించేవారు భారతీయులై ఉండాలని, వారి వయసు 70 సంవత్సరాలకు దాటరాదని, దివాలాదారుడై ఉండకూడదని, మంత్రిగా లేదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదని తెలిపారు. ఇలాంటి నియమాలను పాటించినప్పుడే బిసిసిఐ పరిస్థితి మెరుగవుతుందని అన్నారు.