క్రీడాభూమి

గోపీ ఉత్తమ కోచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: గోపీ ఉత్తమ కోచ్ అనీ, మరో కోచ్ అవసరం తనకు లేదని రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు అమ్మాయి పివి సింధు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో సింధు సన్మాన సభ జరిగినప్పుడు, సింధుకు అత్యుత్తమ కోచ్‌తో శిక్షణ ఇప్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రతిపాదనను ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు సున్నితంగా తోసిపుచ్చింది. గోపీ పర్యవేక్షణలో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, తన దృష్టిలో ఆయనే అత్యుత్తమ కోచ్ అనీ సింధు చెప్పింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం తాను విజయాన్ని ఆస్వాదిస్తున్నానని అంటూ, తనది భారత కులమని వ్యాఖ్యానించింది. సింధు కులం ఏమిటని గూగుల్ సెర్చిలో లక్షలాది మంది శోధించిన విషయాన్ని ప్రస్తావించగా, ఆమె నేరుగా సమాధానం చెప్పలేదు. తాను భారతీయురాలినని, భారత కులానికి చెందిన దానినని చెప్పింది. ‘మా అమ్మానాన్నలను సింధు పేరెంట్స్ అని అంటున్నారు. ఈ రకమైన గుర్తింపు కొత్తగా ఉంది’ అన్నది. తల్లిదండ్రులు, కోచ్‌లు, సన్నిహితులు, అభిమానులకు పేరుపేరున కృతజ్ఞతలు చెప్తున్నానని అన్నది. దేశానికి మరిన్ని పతకాలను సాధించిపెట్టడమే తన లక్ష్యమని చెప్పింది.
ఘనంగా వీడ్కోలు
విజయవాడ (స్పోర్ట్స్): రియో ఒలింపిక్స్‌లో రజితపతకం సాధించిన తెలుగు తేజం పివి సింధుకు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని), ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సత్కారం అందుకున్న పివి సింధు రోజుంతా బిజీ బిజీగా గడిపారు. కోచ్ గోపీచంద్‌తోపాటు సింధు తల్లిదండ్రులు పుష్కరాల ముగింపు కార్యక్రమానికి హాజరై కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం 11గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు.
శుభాకాంక్షలు తెలపడానికి ఈ-పోస్టు
భీమవరం: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ సింధుకి శుభాకాంక్షలు చెప్పేందుకు తపాలా శాఖ ఈ-పోస్టును ఏర్పాటుచేసింది. రూ.10 చెల్లించి, భారతదేశ ప్రజలకు క్రీడాస్ఫూర్తినందించిన సింధుకి శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. అన్ని హెడ్ పోస్ట్ఫాసుల్లో, బ్రాంచి పోస్ట్ఫాసుల్లో ఈ-పోస్టు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ప్రధాన తంతి కార్యాలయాల్లో ఇప్పటికే ఈ సదుపా యం అందుబాటులోకి వచ్చింది.

సింధుకు డైమండ్ నెక్లెస్
సింధుకు ఆరు లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను ఇవ్వనున్నట్లు బుధవారం యన్‌ఎసి జ్యూలరీస్ ఎండి అనంతపద్మనాభన్ ప్రకటించారు. త్వరలో జరగనున్న కార్యక్రమంలో ఈ నెక్లెస్‌ను అందచేయనున్నట్లు ఆయన వివరించారు. బుధవారం సిగ్నేచర్ నెక్‌పీస్‌ను సింధుకు అందచేసారు. ఆమెతోపాటు ఒలింపిక్‌లోప్రతిభ కనపర్చిన సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లకు మూడు లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌తో గౌరవించనున్నట్లు ఆయన వివరించారు.

సింధు, గోపీచంద్
(ఫైల్ ఫొటో)