క్రీడాభూమి

ఆమే వద్దంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 25: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్‌లో పాల్గొనే సమయంలో ప్రత్యేక పానీయాలుగానీ, తినుబండారాలుగానీ అవసరం లేదని రన్నర్ జైషే తనకు చెప్పిందని ఆమె కోచ్ నికోలయ్ స్నెసరెవ్ సంచలన ప్రకటన చేశాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) అధికారులు రేస్ జరుగుతున్న సమయంలో స్టాల్స్‌లో ఎక్కడా కనిపించలేదని, తనకు మంచినీళ్లు ఇచ్చే వారు కూడా కరవయ్యారని జైష ఆరోపించిన విషయం తెలిసిందే. 89వ స్థానంలో నిలిచిన ఆమె రేస్ పూర్తయిన వెంటనే నిస్త్రాణంగా ట్రాక్‌పైనే కళ్లు తిరిగిపడిపోయింది. ఒకానొక దశలో, ట్రాక్‌పైనే ప్రాణాలు పోతాయేమోనని భయపడినట్టు జైష చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆమెకు వ్యతిరేకంగా ఒకొక్కరూ గొంతు విప్పుతున్నారు. ప్రత్యేక పానీయం అవసరమా అని అధికారులు తనను అడిగారనీ, తానే వద్దన్నానని మరో మారథాన్ రన్నర్ కవిత రావత్ స్పష్టం చేసి 24 గంటలు కూడా ముగియక ముందే జైష వ్యక్తిగత కోచ్ నికోలయ్ కూడా ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జైష ఎప్పుడూ ప్రత్యేక పానీయాలను తాగేది కాదని, మంచినీటినే ఆమె కోరుకునేదని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నికోలయ్ చెప్పాడు. బీజింగ్‌లో నిరుడు జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ ఆమె రేసులో పాల్గొంటున్నప్పుడు మంచి నీరే తాగిందని చెప్పాడు. రియోలో తానే స్వయంగా వెళ్లి, ప్రత్యేక పానీయాలుగానీ, తినుబండారాలుగానీ అవసరమా అని అడిగితే వద్దని చెప్పిందని నికోలయ్ అన్నాడు. నిర్వాహకులు మంచి నీటిని అందుబాటులో ఉంచలేదా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ, జైషతో కలిసి తాను కూడా 42 కిలోమీటర్లు పరిగెత్తలేదని వ్యాఖ్యానించాడు. తన దృష్టికి రాని విషయాలపై ఏ విధంగా మాట్లాడతానని ఎదురు ప్రశ్న వేశాడు. ఇతర రన్నర్లను, కోచ్‌లను అడిగానని, 25 కిలో మీటర్ల దూరం తర్వాతే మంచి నీటి ఏర్పాట్లలో లోపం ఉన్నట్టు వారు చెప్పారని అన్నాడు. జైష కూడా రేస్ ముగిసిన వెంటనే ఇదే విషయాన్ని చెప్పిందన్నాడు. ఆమె చేసిన ఆరోపణలు సత్య దూరమని అన్నాడు.

మారథాన్ పరుగును పూర్తి చేసి, ఫినిషింగ్ లైన్ వద్ద ట్రాక్‌పై పడిపోయన జైష
కోచ్ నికోలయ్
(ఫైల్ ఫొటోలు)