క్రీడాభూమి

ఇంగ్లాండ్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, ఆగస్టు 25: పాకిస్తాన్‌తో జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌ను 44 పరుగుల తేడాతో గెల్చుకున్న ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 260 పరుగులు చేసింది. అజర్ అలీ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సర్ఫ్‌రాజ్ అహ్మద్ (55) అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. బాబర్ ఆజమ్ 40 పరుగులతో రాణించాడు. విజయానికి 261 పరుగులు సాధించాల్సి ఉండగా, బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 34.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. జాసన్ రాయ్ (65), జో రూట్ (61) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. ఈ దశలో వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. అప్పటికి ఇయాన్ మోర్గాన్ 33, బెన్ స్టోక్స్ 15 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వర్షం తగ్గకపోవడంతో, మిగతా ఆటను రద్దు చేసిన నిర్వాహకులు ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 151 పరుగులుగా నిర్ధారించి, 44 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించిందని ప్రకటించారు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 6 వికెట్లకు 260 (అజర్ అలీ 82, బాబర్ ఆజమ్ 40, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 55).
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ (వర్షం కారణంగా ఆట నిలిచిపోగా, లక్ష్యం 34.3 ఓవర్లలో 151): 34.3 ఓవర్లలో మూడు వికెట్లకు 194 (జాసన్ రాయ్ 65, జో రూట్ 61, ఇయాన్ మోర్గాన్ 33 నాటౌట్, బెన్ స్టోక్స్ 15 నాటౌట్).

చిత్రం..జాసన్ రాయ్ 65