క్రీడాభూమి

అథ్లెట్లకు శిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్యాంగ్, ఆగస్టు 25: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాంగ్ ఉన్ అసలే నియంత. దానికితోడు అంతులేని మూర్ఖత్వం. తన మాటే చెల్లుబాటు కావాలన్న పట్టుదల. ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్రంగా స్పందిస్తాడు. అతని ఈ అలవాట్లే ఉత్తర కొరియా అథ్లెట్లకు సమస్యలను కొనితెచ్చింది. రియో ఒలింపిక్స్‌కు వెళుతున్నప్పుడే కనీసం ఐదు స్వర్ణాలుసహా 17 పతకాలు సాధించి తిరిగి రావాలని అథ్లెట్లను కిమ్ ఆదేశించాడు. అయితే, అతని అంచనాలకు తగ్గట్టు వారు రాణించలేకపోయారు. రెండు స్వర్ణం, మూడు రజతం, రెండు కాంస్యాలతో మొత్తం ఏడు పతకాలతో వెనుదిరిగారు. ఈ ఫలితాలను చూసి కిమ్‌కు కోపం కట్టలు తెచ్చుకుంది. పతకాలు సాధించలేకపోయిన వారిని బొగ్గు గనుల్లో పని చేయాలని ఆదేశించాడు. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 75 కిలోల విభాగంలో రిమ్ జాంగ్ సిమ్, పురుషుల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్‌లో రీ సెగ్ వాంగ్ స్వర్ణ పతకాలను సాధించారు. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల 56 కిలోల విభాగంలో ఒమ్ యున్ చొల్, మహిళల 63 కిలోల విభాగంలో చో హ్యుసిన్, ప్లస్ 75 కిలోల కేటగిరిలో కిమ్ కుక్ హ్యాంగ్ రజత పతకాలను అందుకున్నారు. షూటింగ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కిమ్ సాంగ్ సాక్, టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో కిమ్ సాంగ్ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. వీరంతా బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు. ఉత్తర కొరియా నుంచి ఒలింపిక్స్‌కు మొత్తం 31 మంది వెళితే, ఏడుగురు శిక్షను తప్పించుకున్నారు. మిగతా 24 మంది తన భవిష్యత్తును తలచుకొని గజగజలాడుతున్నారు. శిక్షలు వేస్తే పతకాలు వస్తాయా? ఇలా భయపెడితే, రానున్న కాలంలో ఎవరైనా క్రీడా పోటీలకు వెళ్లేందుకు సాహసిస్తారా? ఉత్తర కొరియాలో క్రీడలే కనుమరుగు కావా?

చిత్రం..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాంగ్ ఉన్