క్రీడాభూమి

జైష ఆరోపణలపై విచారణ జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్‌లో తాను పాల్గొన్నప్పుడు భారత అధికారులు ఎవరూ స్టాల్స్‌లో లేరని, కనీసం మంచినీరు ఇచ్చే వారు కూడా కరవయ్యారని రన్నర్ ఒపి జైష చేసిన ఆరోపణలపై ఏర్పాటైన కమిటీ విచారణ జాప్యం కానుంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న జైషకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమెకు కనీసం వారం రోజులు విశ్రాంతి కావాలని డాక్టర్ సరళ స్పష్టం చేయడంతో, కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ విచారణకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం జైష ప్రయాణం చేసే పరిస్థితిలో లేదని సరళ అంటున్నారు. నిజానికి విచారణ పూర్తి చేసి, వారం రోజుల్లోగా నివేదికను సమర్పించాలని కేంద్ర మంత్రి ఆదేశించినప్పటికీ, జైష అనారోగ్యం కారణంగా జాప్యం తప్పదని అధికారులు అంటున్నారు.