క్రీడాభూమి

అమాంతం పెరిగిన సింధు బ్రాండ్ వాల్యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తర్వాత తెలుగు అమ్మాయి, స్టార్ షట్లర్ పివి సింధు బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయిందని సమాచారం. ఒలింపిక్స్‌కు ముందు 20 లక్షలుగా ఉన్న బ్రాండ్ వాల్యూ ఇప్పుడు సుమారు రెండు కోట్లకు చేరిందని నిపుణులు అంటున్నారు. కాగా, ఒలింపిక్స్ అనంతరం సింధుకు వచిచన విశేషమైన ప్రచారాన్ని, ప్రజల్లో పెల్లుబుకుతున్న అభిమానాన్ని చూసిన తర్వాత వివిధ సంస్థలు సింధుతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పోటీపడుతున్నాయి. అయితే, ఆమె బ్రాండ్ మార్కెట్ వ్యవహారాలను చూస్తున్న బేస్‌లైన్ వెంచర్స్ సంస్థ ఎలాంటి తొందరపాటు లేకుండా, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందుగానే సింధు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందని, వాటిని దృష్టిలో ఉంచుకొని కొత్త కాంట్రాక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. ఒలింపిక్స్‌లో పతకాన్ని కైవసం చేసుకోవడంతో పెరిగిన ఆమె బ్రాండ్ వాల్యూ చాలాకాలం పదిలంగానే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
నేను అలా అనలేదు: మహమూద్ అలీ
సింధుకు గోపీచంద్ స్థానంలోనే మరో కోచ్‌ని నియమిస్తామని తాను అనలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించేందుకు వీలుగా అత్యుత్తమ శిక్షణకు సహకరిస్తామని తాను చెప్పానని ఆయన అన్నారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని తెలిపారు. కోచ్ స్థానం నుంచి గోపీచంద్‌ను మార్చాలన్న ఆలోచన ఏదీ తమకు లేదని ఆయన తేల్చిచెప్పారు.