క్రీడాభూమి

అమెరికాలో క్రికెట్ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోర్ట్ లాడర్‌డేల్ (అమెరికా), ఆగస్టు 26: మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో సందడి పెరిగింది. బాస్కెట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్న అమెరికాలో రగ్బీ, సాకర్, టెన్నిస్, స్విమ్మింగ్ తర్వాతి స్థానాలను ఆక్రమిస్తాయి. క్రికెట్‌ను ఎన్నో దశాబ్దాలుగా అమెరికా దూరంగా ఉంచింది. అయితే, వివిధ దేశాల నుంచి, ప్రత్యేకంగా భారత్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు అమెరికా వెళ్లడంతో, అక్కడ క్రీడను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త మార్కెట్‌ను సృష్టించుకోవచ్చని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భావిస్తోంది. అమెరికాను తటస్థ వేదికగా చేసుకొని మ్యాచ్‌లు ఆడాలన్న ఐసిసి ప్రతిపాదనకు భారత్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు అంగీకరించారు. రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు అమెరికా ఆతిథ్యమిస్తుండగా, మొదటి మ్యాచ్ శనివారం జరగనుంది. ఈ సిరీస్‌ను గెల్చుకొని, టి-20 ఫార్మెట్‌లో ప్రపంచ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలని మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా ఆశిస్తున్నది. కార్లొస్ బ్రాత్‌వెయిట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, విండీస్ ఏ స్థాయిలో టీమిండియాకు సమాధానం ఇస్తుందనేది అనుమానంగానే ఉంది. అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తున్నది. అయితే, రెండు పర్యాయాలు ఈ ఫార్మెట్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న విండీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీమిండియా కోచ్ అనీల్ కుంబ్లేకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. అందుకే, ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయడం లేదని, విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని అతను స్పష్టం చేశాడు. శుక్రవారం భారత ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమించగా, ధోనీ, కుంబ్లే వ్యూహరచనల్లో మునిగారు. అమెరికాలో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ కావడంతో, ఇరు జట్లు హోరాహోరీకి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా క్రికెట్ అభిమానులకు ఉత్కంఠ భరితమైన పోరును తిలకించే అవకాశం దక్కుతుంది.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్
శనివారం రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది.

చిత్రం... విండీస్‌పై అనుసరించాల్సిన వ్యూహాలపై
టీమిండియా కెప్టెన్ ధోనీ, కోచ్ అనీల్ కుంబ్లే చర్చ