క్రీడాభూమి

రెండు వైఫల్యాల తర్వాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 26: ప్రపంచ నంబర్ వన్ సెరెనా ఈఏడాది వరుసగా రెండు గ్రాండ్ శ్లామ్ టోర్నీలో విఫలమైన తర్వాత, మూడోదైన వింబుల్డన్‌లో టైటిల్ సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావడమేగాక, కెరీర్‌లో అత్యధిక టైటిళ్లను కైవసం చేసుకున్న క్రీడాకారిణుల జాబితాలో రెండో స్థానాన్ని స్ట్ఫె గ్రాఫ్‌తో కలిసి పంచుకుంటున్నది. మార్గరెట్ కోర్ట్ 24 టైటిళ్లతో ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, స్ట్ఫె 22 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం సెరెనా ఖాతాలో 21 టైటిళ్లు ఉన్నాయి. యుఎస్ ఓపెన్‌లో విజయభేరి మోగించి, ఫామ్‌ను కొనసాగించాలని ఆమె అనుకుంటున్నది.
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో తనను ఓడించిన స్పెయిన్ క్రీడాకారిణి గార్బినే ముగురుజా నుంచి సెరెనాకు గట్టిపోటీ తప్పదని విశే్లషకుల అభిప్రాయం. గ్రాండ్ శ్లామ్ టైటిల్ వేటను కొనసాగిస్తానని సెరెనా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, భుజం గాయం ఆమెను వేధించే ప్రమాదం లేకపోలేదు. మురుగుజాతోపాటు ఏంజెలిక్ కెర్బర్, అగ్నీస్కా రద్వాన్‌స్కా తదితరుల నుంచి సెరెనాకు సవాళ్లు తప్పకపోవచ్చు.
జొకోవిచ్‌కు ప్రధాన ప్రత్యర్థి ముర్రే
ఈఏడాది జరిగిన రెండో గ్రాండ్ శ్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ మాదిరిగానే యుఎస్ ఓపెన్‌లోనూ జొకోవిచ్‌కు ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే ప్రధాన ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంది. 2012లో యుఎస్ టైటిల్‌ను సాధించిన ముర్రే మరోసారి ట్రోఫీని స్వీకరించాలని కోరుకుంటున్నాడు. స్టానిస్లాస్ వావ్రిన్కా, రాఫెల్ నాదల్ వంటి మేటి ఆటగాళ్ల నుంచి జొకోవిచ్, ముర్రేలకు గట్టిపోటీ తప్పకపోవచ్చు.

చిత్రాలు..సెరెనా విలియమ్స్, ఆండీ ముర్రే