క్రీడాభూమి

బ్రిస్బేన్ టెన్నిస్ వైదొలగిన షరపోవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, జనవరి 5: హాప్‌మన్ కప్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ నుంచి ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ మోకాలి గాయం కారణంగా వైదొలగ్గా, బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీ నుంచి డిఫెండింగ్ చాంపియన్ మరియా షరపోవా కూడా వైదొలగింది. చేతి గాయం వేధిస్తున్నదని, అందుకే తాను బ్రిస్బేన్ టోర్నీలో పాల్గొనడం లేదని ఆమె ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు సన్నాహక పోటీలుగా హాప్‌మన్ కప్, బ్రిస్బేన్ టోర్నీలను పేర్కొంటారు. ప్రపంచ మేటి క్రీడాకారిణులిద్దరినీ గాయాల సమస్య వేధిస్తున్న నేపథ్యంలో, వీరు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఎంత వరకూ రాణిస్తారన్నది అనుమానంగా మారింది. ఇలావుంటే బ్రిస్బేన్ టోర్నీలో తాను పాల్గొనడం లేదని టాప్ సీడ్ సిమోనా హాలెప్ ప్రకటించింది. ఆమె కండరాల నొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం.

సోమ్‌దేవ్ అవుట్

చెన్నై, జనవరి 5: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్న మెంట్ నుంచి నిష్క్రమించాడు. వైల్డ్ కార్డ్ ఎం ట్రీతో టోర్నమెంట్‌లో అడుగుపెట్టిన రష్యా ఆ టగాడు ఆంద్రీ రుబ్లెవ్‌ను మెయన్‌డ్రా తొలి రౌండ్‌లో ఢీకొన్న సోమ్‌దేవ్ 3-6, 6-3, 3-6 తే డాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. 2014 సె ప్టెంబర్ తర్వాత ఇప్పటి వరకూ సోమ్‌దేవ్ ఎటి పి టూర్ మెయన్ డ్రాలో ఒక్క మ్యాచ్‌ని కూడా గెల్చుకోలేకపోవడం గమనార్హం. క్వాలిఫయ ర్స్‌లో అద్భుతంగా రాణించే అతను మెయన్ డ్రాకు వచ్చేసరికి నీరుగారిపోవడం ఆనవాయ తీగా మారింది. ఇలావుంటే, రాంకుమార్ రా మనాథన్ తొలి రౌండ్‌లో 6-2, 6-0 ఆధిక్యం తో స్పెయన్‌కు చెందిన ప్రపంచ 98వ ర్యాంకర్ డానియల్ గిమెనో ట్రెవర్‌పై సంచలన విజయా న్ని నమోదు చేసి ముందంజ వేశాడు.