క్రీడాభూమి

కెన్యా ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యదర్శి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరోబీ, ఆగస్టు 27: కెన్యా ఒలింపిక్ కమిటీ (ఎన్‌ఒసికె) ప్రధాన కార్యదర్శి ఫ్రాన్సిస్ పాల్‌ను పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని కెన్యా క్రీడా శాఖ మంత్రి హసన్ వారియో ప్రకటించాడు. ఎన్‌ఒసికె నుంచి అతనిని తప్పిస్తున్నట్టు తెలిపాడు. రియో ఒలింపిక్స్‌లో కెన్యా వైఫల్యాలకు పాల్ అనుసరించిన అవినీతి విధానాలు, ఆశ్రీత పక్షపాతమే ప్రధాన కారణాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేర పరిశోధన విభాగం ఈ ఆరోపణలపై విచారణను చేపట్టింది. ఒలింపిక్స్‌కు అభ్యర్థుల ఎంపిక నుంచి, వారికి శిక్షణ కోసం కల్పించే వసతుల వరకూ అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందని ప్రథమిక దర్యాప్తులో తేల్చింది. ఈ విచారణలో భాగంగానే పాల్‌ను అరెస్టు చేశారు. అతనిని కోర్టు ముందు హాజరుపరచి, ప్రశ్నించడానికి వీలుగా తమ కష్టడీకి ఇవ్వాల్సిందిగా డిటెక్టివ్ అధికారులు కోరే అవకాశం ఉంది. రియో ఒలింపిక్స్‌లో కెన్యా ఆరు స్వర్ణాలుసహా మొత్తం 13 పతకాలను సాధించి, 15వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కెన్యా సర్కారు సంతృప్తి చెందలేదు. కొన్ని విభాగాల్లో పతకాలు వచ్చేవని, కానీ, పాల్ అనుసరించిన విధానాల కారణంగానే అది సాధ్యం కాలేదని కెన్యా సర్కారు అభిప్రాయపడుతున్నది.

చిత్రం.. ఫ్రాన్సిస్ పాల్