క్రీడాభూమి

మెయన్ డ్రాకు సాకేత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 27: భారత టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేని యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మెయన్ డ్రా కు అర్హత సంపాదించాడు. చివరి క్వాలిఫయర్‌లో అతను సెర్బియాకు చెందిన పెజా క్రిస్టిన్‌ను 6-3, 6-0 తేడాతో సునాయాసంగా ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 56 నిమిషాల్లో ముగియడం గమనార్హం. కాగా, భారత్ నుంచి పురుషుల సింగిల్స్ మెయన్ డ్రాకు సాకేత్ ఒక్కడే అర్హత సంపాదించాడు. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో అతను యుఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో ఉన్న తెలుగు వీరుడు సాకేత్ ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో మెయన్ డ్రాకు చేరడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓఫెన్‌లలో అతను ఎప్పుడూ క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌ను అధిగమించలేకపోయాడు. రియో ఒలింపిక్స్‌కు తన భాగస్వామిగా సాకేత్‌ను పంపాల్సిందిగా రోహన్ బొపన్న చేసిన విజ్ఞప్తిని భారత టెన్నిస్ సం ఘం (ఎఐటిఎ) తిరస్కరించింది. వివాదాస్పదమైన ఈ నిర్ణయం చేదు ఫలితానే్న ఇచ్చింది. సాకేత్‌ను కాదని లి యాండర్ పేస్‌ను బొపన్నకు భాగస్వామిగా ఎంపిక చేసి ఎఐటిఎ పొరపాటు చేసింది. ఈ జోడీ మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించింది. బొపన్న కోరుకున్నట్టు పేస్‌ను పంపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. యుఎస్ ఓపెన్‌లో సాకేత్ రాణిస్తే, అది ఎఐటిఎకు చెంపపెట్టు అవుతుంది.