క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో ఓడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాడెర్‌హిల్ (అమెరికా), ఆగస్టు 27: వెస్టిండీస్‌తో శనివారం చివరి క్షణం వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మొదటి టి-20 మ్యాచ్‌లో భారత్ ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది. టెస్టు ఆటగాడిగా ముద్ర వేయంచుకున్న లోకేష్ రాహుల్ బాధ్యతాయుతమైన శతకం టీమిండియా ను గెలిపించలేకపోయంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి ఓవర్ చివరి బంతికి అవుట్ కావడం భారత్ పరాజయానికి కారణమైంది. వెస్టిండీస్ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయన భారత్ 20 ఓ వర్లలో నాలుగు వికెట్లకు 244 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా, వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను జాన్సన్ చార్లెస్, ఇవిన్ లూయిస్ ధాటిగా ఆరంభించారు. చార్లెస్ భారత బౌలర్లపై విరుచుకుపడితే, లూయిస్ అతనికి చక్కటి మద్దతునిచ్చాడు. ఇద్దరూ 9.3 ఓవర్లలో 126 పరుగులు జోడించారు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నించిన చార్లెస్ క్లీన్ బౌల్డ్ కావడంతో విండీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అతను 33 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు. చార్లెస్ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారీ షాట్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఆండ్రె రసెల్ 22 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. అదే ఓవర్‌లో లూయిస్ వికెట్ కూడా కూలింది. అశ్విన్ క్యాచ్ పట్టగా వెనుదిరిగిన లూయిస్ 49 బంతుల్లో, 5 ఫోర్లు, 9 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేశాడు. కాగా, కీరన్ పోలార్డ్ (22), కార్లొస్ బ్రాత్‌వెయిట్ (14), లెండల్ సిమన్స్ (0) మ్యాచ్ చివరి ఓవర్‌లో అవుటయ్యారు. 20 ఓవర్లలో విండీస్ ఆరు వికెట్లకు 245 పరుగుల భారీ స్కోరు సాధించగా, అప్పటికి డ్వెయిన్ బ్రేవో (1), మార్లొన్ శామ్యూల్స్ (1) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. చార్లెస్, లూయస్ ప్రతిభతో విండీస్ 245 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
ఆదిలో తడబాటు
భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తిన్నది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద తొలి వికెట్‌ను ఆజింక్య రహానే రూపంలో కోల్పోయంది. అతను ఏడు పరుగులు చేసి, డ్వెయన్ బ్రేవో క్యాచ్ పట్టగా రసెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయతే ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించడంతో టీమిండియా కోలుకునే అవకాశాలు కనిపించాయ. కానీ, డ్వెయన్ బ్రేవో బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ఆండ్రె ఫ్లెచర్ క్యాచ్ పట్టడంతో కోహ్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అతను కేవలం తొమ్మిది బం తుల్లోనే 16 పరుగులు చేసి, విజయంపై ఆశలు రేపినా, ఎవరూ ఊ హించని విధంగా పొరపాటు షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన లోకేష్ రాహుల్ విండీస్ బౌలింగ్‌పై విరుచుకుపడ్డాడు. రోహిత్‌తో కలిసి రన్‌రేట్ తగ్గకుండా జాగ్ర త్త పడ్డాడు. బ్రాత్‌వెయట్ వేసిన ఓవర్‌లో బంతిని బౌండరీకి తరలించి రాహుల్ భారత్ స్కోరును వంద పరుగుల మైలురాయని దాటించాడు. కాగా, పోలార్డ్ వేసిన బంతిని భారీ సిక్స్‌గా కొట్టి రోహిత్ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. 22 బంతుల్లో అతనికి హాఫ్ సెంచరీ సాధ్యమైంది. పోలార్ట్ బౌలింగ్‌లోనే రాహుల్ కూడా హాఫ్ సెంచరీ లైన్‌ను దాటాడు. కాగా, మూడో వికెట్‌కు రాహుల్‌తో కలిసి 7.1 ఓవర్లలో 89 పరుగులు జోడించిన రోహిత్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పోలార్డ్ బౌలింగ్‌లో చార్లెస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యడు. అతను 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. రోహిత్ నిష్క్రమణతో జట్టును గెలిపించే బాధ్యతను రాహుల్ స్వీకరించాడు. విండీస్ బౌలింగ్‌ను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆడిన అతను 46 బం తుల్లో శతకాన్ని సాధించాడు. టి-20 కెరీర్‌లో అతనికి ఇదే తొలి శతకం. కాగా, రిచర్డ్ లేవీ 45 బంతుల్లో శతకాన్ని నమోదు చేసి నెలకొల్పిన రికార్డును అతను తృటిలో కోల్పోయాడు. కెప్టెన్ ధోనీతో కలిసి అతను భారత జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. గెలవడానికి చివరి ఓవర్‌లో ఎనిమది ప రుగులు అవసరంకాగా, ఆరు పరుగులు లభించాయ. డ్వె యన్ బ్రేవో వేసిన ఆ ఓవర్ చివరి బంతిలో శామ్యూల్స్‌కు దొరికిపోయన ధోనీ (43) అవుట్‌కావడంతో భారత్‌కు ఓట మి తప్పలేదు. చివరి క్షణం వరకూ విజయం కోసం తీవ్రంగా పోరాటం సాగించి, ధోనీతో కలిసి నాలుగో వికెట్‌కు 8.1 ఓవ ర్లలో 107 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన రాహుల్ మొత్తం 51 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, 5 సిక్సర్ల సా యంతో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ ను విజయం ముంగిట వరకూ చేర్చినప్పటికీ, ధోనీతోపాటు తాను కూడా చివరి ఓవర్‌లో ఒత్తిడికి గురయ్యాడు. ఫలితం గా అద్భుతమైన అతని పోరాట పటిమ వృథా అయంది. కీల కమైన చివరి ఓవర్ వేసిన డ్వెయన్ బ్రేవో, అద్భుతమైన ఆరం భాన్ని అందించిన జాన్సన్ చార్లెస్, ఇవిన్ లూయస్ విండీస్ విజ యంలో కీలక భూమిక పోషించారు. అయతే, బ్రేవో వేసిన చివరి ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని భారత్‌కు వ్యతిరేకంగా, విండీస్‌కు అనుకూలంగా మార్చేసింది. విండీస్‌కు అనుకూలంగా మారి, ఆ జట్టుకు రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందించింది.

వెస్టిండీస్ మొదటి 10 ఓవర్లలో 132 పరుగులు సాధించింది. టి-20 ఇంటర్నేషనల్ చరిత్రలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఒక జట్టు మొదటి పది ఓవర్లలో చేసిన అత్యధిక స్కోరు ఇది. 2009లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా సెంచూరియన్ మైదానంలో 131 పరుగులు చేయగా, విండీస్ ఆ రికార్డును ఒక పరుగు తేడాతో అధిగమించింది.
అత్యంత వేగంగా టి-20 శతకాన్ని సాధించిన రికార్డును భారత బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్ చేజార్చుకోగా, విండీస్ ఆటగాడు ఇవిన్ లూయస్ తన జట్టు తరఫున వేగంగా సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు.

స్టువర్ట్ బిన్నీ ఒకే ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. టి-20 ఫార్మెట్‌లో ఒక ఓవర్‌లో ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలోకి వెళ్లాడు. 2007లో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లను కొట్టి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.

భారత జట్టు మొదటి ఆరు ఓవర్లలో 78 పరుగులు సమర్పించుకుంది. టి-20 చరిత్రలో టీమిండియా భారీగా పరుగులు ఇవ్వడంలో ఇదే రికార్డు. వెస్టిండీస్‌కు మాత్రం మొదటి ఆరు ఓవర్లలో చేసిన అత్యధిక పరుగులు 86. నిరుడు జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆ ఫీట్‌ను నమోదు చేసింది.

స్కోరుబోర్డు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: జాన్సన్ చార్లెస్ బి మహమ్మద్ షమీ 79, ఇవిన్ లూయిస్ సి అశ్విన్ బి రవీంద్ర జడేజా 100, ఆండ్రె రసెల్ ఎల్‌బి రవీంద్ర జడేజా 22, కీరన్ పోలార్డ్ బి జస్‌ప్రీత్ బుమ్రా 22, కార్లొస్ బ్రాత్‌వెయిట్ రనౌట్ 14, డ్వెయిన్ బ్రేవో నాటౌట్ 1, లెండల్ సిమన్స్ బి జస్‌ప్రీత్ బుమ్రా 0, మార్లొన్ శామ్యూల్స్ నాటౌట్ 1, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245.
వికెట్ల పతనం: 1-126, 2-204, 3-205, 4-236, 5-244, 6-244.
బౌలింగ్: మహమ్మద్ షమీ 4-0-48-1, భువనేశ్వర్ కుమార్ 4-0-43-0, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-47-2, అశ్విన్ 4-0-36-0, రవీంద్ర జడేజా 3-0-39-2, స్టువర్ట్ బిన్నీ 3-0-32-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి చార్లెస్ బి కీరన్ పోలార్డ్ 62, ఆజింక్య రహానే సి డ్వెయన్ బ్రేవో బి ఆండ్రె రెసెల్ 7, విరాట్ కోహ్లీ సి ఆండ్రె ఫ్లెచర్ బి డ్వెయన్ బ్రేవో 16, లోకేష్ రాహుల్ నాటౌట్ 110, మహేంద్ర సింగ్ ధోనీ సి శామ్యూల్స్ బి డ్వెయన్ బ్రేవో 43, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 244.
వికెట్ల పతనం: 1-31, 2-48, 3-137, 4-244.
బౌలింగ్:
ఆండ్రె రసెల్ 4-0-53-1, శామ్యూల్ బద్రీ 2-0-25-0, డ్వెయన్ బ్రేవో 4-0-37-2, కార్లొస్ బ్రాత్‌వెయట్ 4-0-47-0, సునీల్ నారైన్ 3-0-50-0, కీరన్ పోలార్డ్ 3-0-30-1.

చిత్రాలు.. లోకేష్ రాహుల్
(110 నాటౌట్)

49 బంతుల్లో శతకాన్ని నమోదు చేసిన లూయస్