క్రీడాభూమి

లంక క్రికెటర్లపై దాడి చేసిన ఉగ్రవాదుల కాల్చివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఆగస్టు 28: లాహోర్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వెళుతున్న శ్రీలంక క్రికెటర్లపై దాడికి తెగబడిన నలుగురు ఉవ్రాదులను హతమార్చినట్టు పాకిస్తాన్ పోలీస్ అధికారులు ప్రకటించారు. 2009లో జరిగిన ఆ సంఘటనలో తొమ్మిది మంత్రి పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందగా, ఆరుగురు క్రికెటర్లు స్వల్పంగా గాయపడ్డారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే లంక ఆటగాళ్లు పాకిస్తాన్ టూర్‌ను రద్దు చేసుకొని స్వదేశానికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కెన్యా, జింబాబ్వేలను మినహాయిస్తే, ఏ జట్టూ పాకిస్తాన్‌లో పర్యటించలేదు. ఫలితంగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో పాక్ హోం సిరీస్‌లను ఆడుతున్నది. కాగా, లంక ఆటగాళ్లపై దాడి చేసిన నలుగురు ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారని అధికారులు ప్రకటించారు. అయితే, వారి పేర్లనుగానీ, ఏ సంస్థకు చెందిన వారనే వివరాలనుగానీ వెల్లడించలేదు.