క్రీడాభూమి

కళాత్మక టెన్నిస్ విందు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 28: టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఒకటి, ప్రతి ఏడాదీ ఆఖరు జరిగే యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. పవర్ ప్లేకు కాకుండా కళాత్మక విలువలకు అద్దం పట్టే ఈ టోర్నమెంట్‌లో విజేతలు ఎవరైనా, ప్రతి మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయం. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ మరోసారి టైటిల్ వేటను కొనసాగించనున్నాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత ఫ్లావియా పెనెట్టా కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ హాట్ ఫేవరిట్‌గా మారింది. ఇటీవలే వింబుల్డన్ టైటిల్‌ను సాధించి మంచి ఫామ్‌లో ఉన్న ఆమె టైటిల్‌పై కనే్నసింది. కాగా, ఎన్నో రకాలుగా ప్రత్యేకతలను సంతరించుకున్న యుఎస్ ఓపెన్ నిజమైన టెన్నిస్‌కు చిరునామాగా కొనసాగుతున్నది. ఇతర గ్రాండ్ శ్లామ్స్‌సహా మరే ఇతర టెన్నిస్ టోర్నీల్లో లేని టైబ్రేకర్ విధానాన్ని యుఎస్ ఓపెన్‌లో అమలు చేయడంతో, ఈ ఈవెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మ్యాచ్‌లను గంటలకు గంటలు సాగదీయకుండా, సాకర్, ఫీల్డ్ హాకీ వంటి క్రీడల్లో అనుసరించే టైబ్రేకర్ విధానాన్ని టెన్నిస్‌లో ప్రవేశపెట్టిన యుఎస్ ఓపెన్ నిర్వాహకులకు దక్కుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్స్‌ను గ్రాండ్ శ్లామ్స్‌గా పిలుస్తారు. ఈ నాలుగు టోర్నీల్లో అత్యంత పురాతనమైనది వింబుల్డన్. 1877లో మొదలైన వింబుల్డన్‌ను అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా పరిగణిస్తారు. నాలుగేళ్ల తర్వాత, 1881లో యుఎస్ ఓపెన్ మొదలైంది. ఆరంభంలో పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ టోర్నమెంట్‌లో 1887 నుంచి మహిళలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ 1891లో మొదలైంది. ఆస్ట్రేలియా ఓపెన్ ఈ జాబితాలో అన్నిటికంటే ఆలస్యంగా 1905లో మొదలైంది.
న్యూపోర్ట్ నుంచి న్యూయార్క్ వరకు..
యుఎస్ ఓపెన్ ప్రస్థానం న్యూపోర్ట్ నుంచి మొదలై, న్యూయార్క్‌లో స్థిరపడింది. ఈ టోర్నమెంట్‌ను మొదట రోడ్స్ ఐలాండ్‌లోని న్యూపోర్ట్‌లో నిర్వహించారు. తర్వాత ఈ టోర్నీ న్యూయార్క్‌లోని ఫారెస్ట్ హిల్స్ ప్రాంతానికి చేరింది. 1920 దశంలో మూడేళ్లు ఫిలడేల్ఫియా కేంద్రంగా మ్యాచ్‌లు కొనసాగాయ. చివరికి టోర్నీ న్యూయార్క్ చేరింది. అదే శాశ్వత వేదికైంది. మిగతా మూడు గ్రాండ్ శ్లామ్స్ మాదిరిగానే యుఎస్ ఓపెన్‌లోనూ పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్, సీనియర్స్, జూనియర్స్, ప్లేయర్స్ ఇన్ వీల్‌చైర్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తారు. యునైటెడ్ నేషన్స్ టెన్నిస్ అసోసియేషన్ (యుఎస్‌టిఎ) బిల్లీ జీన్ కింగ్ జాతీయ టెన్నిస్ సెంటర్‌లో నిర్మించిన ఆర్థర్ అషే స్టేడియం యుఎస్ ఓపెన్‌కు ప్రధాన వేదిక. ఫ్లషింగ్ మెడోస్-కొరోనా పార్క్‌లో బిల్జీ జీన్ కింగ్ టెన్నిస్ సెంటర్ ఉంది. ఈ సెంటర్‌లో మొత్తం 33 కోర్టులున్నాయి. ఆర్థర్ అషే స్టేడియంలో 23,000 మంది ప్రేక్షకులు మ్యాచ్‌ని తిలకింవచ్చు. అది ప్రపంచంలోనే అవుట్ డోర్ టెన్నిస్ స్టేడియం. బిల్జీ జీన్ కింగ్ జాతీయ టెన్నిస్ సెంటర్‌లోని 33 స్టేడియాల్లోనూ ఫ్లడ్ లైట్స్ సౌకర్యం ఉంది. అవసరమైతే మ్యాచ్‌లను రాత్రి సమయాల్లోనూ కొనసాగించే వెసులుబాటు నిర్వాహకులకు ఉంటుంది.
డైరెక్ట్ ఫైనల్ విధానం రద్దు
సహజంగా ఏ టోర్నీలోనైనా సీడింగ్స్ ప్రకారం మెయిన్ డ్రాకు అర్హత కల్పిస్తారు. మిగతా వారు క్వాలిఫయర్స్ దశను నెగ్గుకొని మెయిన్ డ్రాకు చేరుకుంటారు. మొదటి రౌండ్ నుంచి సెమీస్ వరకూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్ చేరతారు. అయితే, యుఎస్ ఓపెన్‌లో 1915 వరకూ నిరుటి విజేత నేరుగా ఫైనల్‌లో ఆడేవాడు. ఒక ఏడాది టైటిల్ సాధిస్తే, మరుసటి ఏడాది అతను ఒక్క రౌండ్ కూడా ఆడకుండానే ఫైనల్‌లో స్థానం సంపాదిస్తాడు.
1915లో ఈ విధానాన్ని రద్దు చేసి, మిగతా టోర్నీల్లో మాదిరిగానే, మెయిన్ డ్రాకు అర్హత పొందిన ప్రతి ఒక్కరూ అన్ని దశలను దాటి ఫైనల్ చేరాలనే విధానాన్ని ప్రవేశపెట్టారు.
భారీ ప్రైజ్ మనీ
యుఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ ఆరంభంలో తక్కువగా ఉండేది. 1968 నాటికి ఈ మొత్తం లక్ష డాలర్లకు చేరింది. ఇప్పుడు పురుషులు, మహిళల విభాగాల్లో సింగిల్స్ విజేతలు ఒక్కొక్కరికీ 33 లక్షల డాలర్లు లభిస్తున్నాయి. లక్ష డాలర్ల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన ప్రైజ్ మనీ ఇప్పుడు 4.22 కోట్ల డాలర్లకు చేరింది. ఇది సుమారు 254 కోట్ల రూపాయలకు సమానం. క్వాలిఫయర్స్‌లో ఆడిన వారికి కూడా ప్రైజ్‌మనీ లభిస్తుంది. మూడు దశల్లో జరిగే క్వాలిఫయర్స్‌లో వరుసగా 5,000, 10,000, 15,000 డాలర్లు చెల్లిస్తారు. ఫస్ట్ రౌండ్‌కు చేరితే 39,500, రెండో రౌండ్‌కు చేరితే 68,600, మూడో రౌండ్‌లోకి అడుగుపెడితే 1,20,200 డాలర్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ప్రీ క్వార్టర్స్‌లో చేరిన వారికి 2,13,575, క్వార్టర్ ఫైనల్స్‌లోకి వెళ్లిన వారికి 4,10,975 డాలర్లు లభిస్తాయి. సెమీ ఫైనల్స్ చేరితే 8,05,000, ఫైనల్ చేరితే 18,00,000 డాలర్లు సొంతమవుతాయి.

‘టాప్-10’ సీడింగ్స్
పురుషుల విభాగం
1. నొవాక్ జొకోవిచ్, 2. ఆండీ ముర్రే 3. స్టానిస్లాస్ వావ్రిన్కా, 4. రాఫెల్ నాదల్, 5. మిలోస్ రవోనిక్, 6. కెయ్ నిషికోరి, 7. మారిన్ సిలిక్, 8. డామినిక్ థియెమ్, 9. జో విల్‌ఫ్రైడ్ సొంగా, 10. గేల్ మోన్ఫిల్.
మహిళల విభాగం
1. సెరెనా విలియమ్స్, 2. ఏంజెలిక్ కెర్బర్, 3. గార్బినె ముగురుజా, 4. ఆగ్నీస్కా రద్వాన్‌స్కా, 5. సిమోనా హాలెప్, 6. వీనస్ విలియమ్స్, 7. రాబర్టా విన్సీ, 8. మాడిసన్ కీస్, 9, స్వెత్లానా కుజ్నెత్సెవా, 10. కరోలినా ప్లిస్కోవా.