క్రీడాభూమి

భారత రత్న ఎందుకివ్వరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ధ్యాన్ చంద్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నా, ఇప్పటికీ ఆ దిశగా సర్కారు అడుగు వేయడం లేదు. ఈ అవార్డుకు క్రీడాకారులు అర్హులు కాదన్న వాదన చాలాకాలం కొనసాగింది. పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా భారత రత్న అవార్డుకు క్రీడాకారులు కూడా అర్హులేనని అప్పటి యుపిఎ సర్కారు ప్రకటించింది. తొలి అవకాశం ధ్యాన్ చంద్‌కు లభించాలని, అతనే ఈ అవార్డుకు అన్ని విధాల అర్హుడని ప్రతిపాదనలు వచ్చాయి. చాలా మంది పార్లమెంటు సభ్యులు కూడా ధ్యాన్ చంద్‌కు అనుకూలంగా గళం విప్పారు. కానీ, ప్రభుత్వం మాత్రం క్రికెటర్ సచిన్ తెండూల్కర్ వైపే మొగ్గు చూపింది. భారత రత్న అవార్డును స్వీకరించిన తొలి క్రీడాకారుడిగా సచిన్ రికార్డు పుస్తకాల్లో చేరాడు. అయితే, ఆతర్వాత కూడా ధ్యాన్ చంద్ పేరును అవార్డుకు పరిశీలించకపోవడం దురదృష్టకరం. తన తండ్రికి భారత రత్నను ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావడం లేదని ధ్యాన్ చంద్ కుమారుడు, భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు అశోక్ కుమార్ వాపోయాడు. ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా సోమవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని, కానీ, ఆయనకు నిజమైన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించాడు. మోదీ సర్కారు వెంటనే స్పందించాలని, తన తండ్రికి భారత రత్నను ప్రకటించాలని కోరాడు.

చిత్రం.. ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత ధ్యాన్‌చంద్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న మాజీ హాకీ క్రీడాకారులు