క్రీడాభూమి

భిన్నస్వరాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రియో ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక విఫలమైనప్పటికీ, జీతూ రాయ్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అతనికి ఖేల్ రత్న అవార్డు రావడాన్ని సమర్ధిస్తున్న వారి వాదన. నేపాల్‌లో 1982 ఆగస్టు 26న జన్మించిన జీతూ లక్నో (ఉత్తర ప్రదేశ్)లో స్థిరపడ్డాడు. గత రెండేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున మెరుగైన ప్రదర్శనలతో రాణిస్తున్నాడు. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్‌లో ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు సాధించాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యాన్ని అందుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అదే విధంగా 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ప్రస్తుతం అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ కప్‌లో భారత్‌కు ఎక్కువ పతకాలను అందించిన షూటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఎన్నో అంచనాలతో రియోకి వెళ్లిన అతను అనూహ్యంగా విఫలం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతనిని ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జీతూను విమర్శిస్తున్న వారితోపాటు రియోలో విఫలమైనంత మాత్రాన తక్కువ చేయడం సబబు కాదని వాదిస్తున్న వారు కూడా ఉన్నారు.
అనుకోకుండా ఆ ఇద్దరు: రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఇద్దరికి లభించడం ఖాయంగా కనిపించగా, అనుకోకుండా మరో ఇద్దరు కూడా అవార్డుకు ఎంపికకావడం విచిత్రం. సోమవారం అవార్డుల ప్రదానం సందర్భంగా ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఒలింపిక్స్ లేదా ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన వారికి ఈ అవార్డు దక్కుతుంది. ఒకవేళ పతకాలు సాధించిన వారు లేకపోతే, క్రీడా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డును ప్రదానం చేస్తారు. ఈ కోణంలో చూస్తే, రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షిలకే అవార్డు లభించాలి. కానీ, మరో ఇద్దరు, దీపా కర్మాకర్, జీతూ రాయ్‌కి కూడా ఈ జాబితాలో స్థానం దక్కింది. గతంలో ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురికి ఖేల్ రత్న అవార్డును ఇచ్చిన సంఘటనలున్నాయి. కానీ, నలుగురికి ఈ అవార్డు దక్కడం ఇదే మొదటిసారి. ఒకరి కంటే ఎక్కువ మందికి అవార్డు ప్రదానం చేసిన సంఘటనలను పరిశీలిస్తే, మొట్టమొదటిసారి 1993-94 సీజన్‌లో కమాండర్ హోమీ మోతీవాలా, లెఫ్టినెంట్ కమాండర్ పికె గార్గ్ (యాచింగ్ టీం ఈవెంట్) సంయుక్తంగా ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యారు. అదే విధంగా, 2002లో కెఎం బీనామోల్ (అథ్లెటిక్స్), అంజలీ భగవత్ (షూటింగ్)కు ఈ అవార్డు దక్కింది. 2009లో మేరీ కోమ్ (బాక్సింగ్), విజేందర్ సింగ్ (బాక్సింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్) అవార్డు గ్రహీతలయ్యారు. 2012లో లండన్ ఒలింపిక్స్ హీరోలు విజయ్ కుమార్ (షూటింగ్), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్) అవార్డును స్వీకరించారు. కాగా, రెండు సంవత్సరాలు (2008, 2014) ఈ పురస్కారం ఎవరికీ దక్కకలేదు. నిరుడు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.

చిత్రం.. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న జీతూ రాయ్, దీపా కర్మాకర్