క్రీడాభూమి

అంచనాలు లేకుండానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రెజ్లర్ సాక్షి మాలిక్ ఎలాంటి అంచనాలు లేకుండానే ఒలింపిక్స్‌కు వెళ్లింది. అక్కడ కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశమంతా మారుమోగింది. రోహ్‌తక్ (హర్యానా)లో 1992 సెప్టెంబర్ 3న జన్మించిన సాక్షి రియో విజయంతోనే ఖేల్ రత్న అవార్డును సొంతం చేసుకుంది. 23 ఏళ్ల సాక్షి రియో ఒలింపిక్స్ కంటే ముందు, 2014 గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అదే ఏడాది జరిగిన ఇంచియాన్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల విభాగంలో ఒలింపిక్ పతకాన్ని భారత్‌కు అందించిన మొదటి రెజ్లర్‌గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. మహిళల రెజ్లింగ్‌లో వినేష్ ఫొగట్ పతకం సాధిస్తుందని క్రీడా పండితులు అంచనా వేయగా, సాక్షి పేరును ఎవరూ ప్రస్తావించలేదు. ఒలింపిక్స్‌కు ఆమె వెళ్లిన విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే, ఆమె రియోలో భారత్‌కు తొలి పతకాన్ని అందించినప్పుడు దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఆమె పేరును మొదటిసారి విన్న వారు కూడా లేకపోలేదు. మొత్తం మీద అందరి అంచనాలను తారుమారు చేస్తూ, రియోలో పతకాన్ని కైవసం చేసుకున్న సాక్షి ఎంతో మంది యువ మహిళా రెజ్లర్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
ఇంటర్వ్యూలకు తీరిక లేదు..
‘మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకుంటున్నారా? నాకు అంత తీరిక లేదు. నేను ఖాళీగా లేని విషయాన్ని చూస్తున్నారుగా’ అంటూ పాత్రికేయులపై రెజ్లర్ సాక్షి మాలిక్ అసహనం వ్యక్తం చేసింది. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె రాష్టప్రతి భవన్‌లో సోమవారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించడానికి వచ్చినప్పుడు విలేఖరులు ఫొటోలు తీయడానికి పోటీపడ్డారు. కొందరు ఆమె స్పందన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇంటర్వ్యూలో ఇచ్చేటంత సమయం తనకు లేదంటూ ఆమె అసహనంగా సమాధానమిచ్చింది. విలేఖరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. మహిళల రెజ్లింగ్ 58 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకొని సాక్షి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అపూర్వ విజయమే ఆమెకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సంపాదించిపెట్టింది.
చిత్రం.. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరిస్తున్న రెజ్లర్ సాక్షి మాలిక్