క్రీడాభూమి

దీప రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించలేకపోయనా, తన అద్వితీయ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. అగర్తలా (త్రిపుర)లో 1993 ఆగస్టు 9న జన్మించిన దీప ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తొలి భారత మహిళగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. భారత దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించిన తర్వాత ఇప్పటి వరకూ 11 మంది జిమ్నాస్టులు మన దేశం తరఫున పాల్గొన్నారు. చివరిసారి 1964లో భారత్ జిమ్నాస్టిక్స్ విభాగంలో పోటీపడ్డారు. వీరంతా పురుషులే కావడం గమనార్హం. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా త్రిపురకు చెందిన దీప సరికొత్త రికార్డు సృష్టించింది. 1952లో ఇద్దరు, 1956లో ముగ్గురు, 1964లో ఆరుగురు జిమ్నాస్ట్‌లో బరిలోకి దిగినప్పటికీ భారత్‌కు పతకాన్ని అందించలేకపోయారు. ఈసారి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో పోటీపడిన దీప కూడా పతకం సాధించడంలో విఫలమైంది. అయతే, తన అద్వితీయ పోరాటం ద్వారా ఆమె లక్షలాది మంది ప్రజల నీరాజనాలు అందుకుంది. నిరుడు నవంబర్‌లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్‌లో దీప చివరి వరకూ శ్రమించింది. కానీ, ఐదో స్థానంలో నిలవడంతో ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేకపోయింది. 2014లో జరిగిన గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్న భారత తొలి మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పిన ఆమెకు రియోలో బరిలోకి దిగేందుకు చివరి అవకాశం క్వాలిఫయర్స్ ద్వారా లభించింది. ఇందులో విఫలమైతే దీప ఒలింపిక్స్ ఆశలకు తెరపడేది. కానీ, చివరి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. అక్కడ కూడా చివరి వరకూ పోరాడింది. కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయ నాలుగో స్థానంలో నిలిచింది. జిమ్నాస్టిక్స్ ఏ మాత్రం ఆదరణగానీ, జిమ్నాస్ట్‌లకు వౌలిక వసతులుగానీ లేని మన దేశం నుంచి అంతర్జాతీయ స్థయకి ఎదిగిన దీప 2014 గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. నిరుడు హిరోషిమాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లోనూ ఆమెకు కాంస్య పతకం లభించింది. అత్యంత ప్రమాదకరమైన ప్రొడునొవా విన్యాసాన్ని ప్రదర్శించే అతి తక్కువ జిమ్నాస్ట్‌లలో దీప ఉంది.