క్రీడాభూమి

వినేష్ కన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ సోమవారం అర్జున అవార్డును స్వీకరించడానికి వీల్‌చైర్‌లో వచ్చింది. నలుగురు ఒలింపియన్లు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించగా, ఆ దృశ్యాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకుంది. మోకాలికి గాయం కాకుండా ఉంటే, ఆమెకు రియో ఒలింపిక్స్‌లో పతకం తప్పక లభించేదని విశే్లషకుల అభిప్రాయం. కానీ, ఆమె గాయంతో బౌట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మహిళల 48 కిలోల ఫ్రీస్టయిల్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఆమె గాయపడింది. చైనాకు చెందిన సన్ యనాన్‌తో తలపడిన ఆమె కుస్తీ పడుతున్న సమయంలో మోకాలికి బలమైన గాయమైంది. అయితే, గాయాన్ని లెక్కచేయకుండా ఆమె పోరాటాన్ని కొనసాగించింది. దీనితో కాలి కండరాలు చిట్లాయి. నొప్పితో విలవిల్లాడుతున్న వినేష్‌ను స్ట్రెచర్‌పై తరలించాల్సి వచ్చింది. కాలికి బ్యాండేజీతో రాష్టప్రతి భవన్‌కు అర్జున అవార్డును స్వీకరించడానికి వచ్చిన ఆమె ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తనను కలిసిన విలేఖరులతో మాట్లాడింది. గాయం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నపై స్పందిస్తూ, ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నది. ‘రెండు మూడు వారాలు లేదా రెండు మూడు నెలలు.. ఆరు నెలలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గాయం ఎప్పుడు నయమవుతుందో ఇప్పుడే చెప్పలేదు’ అన్నది.

చిత్రం.. వీల్‌చైర్‌లో వచ్చిన రెజ్లర్ వినేష్ ఫొగట్