క్రీడాభూమి

ఖేల్ రత్నాలకు అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్న ‘లెజెండరీ’ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నలుగురు ఒలింపిక్ స్టార్లకు భారత క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సోమవారం రాష్టప్రతి అందచేశారు. రియో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్ సింగిల్స్‌లో రజత పతకాన్ని సాధించిన పివి సింధు, కాంస్యాన్ని గెల్చుకున్న మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మహిళల జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టంచమేగాక, అద్వితీయ ప్రతిభ కనబరచి, నాలుగో స్థానంలో నిలవడం ద్వారా తృటిలో కాంస్యాన్ని కోల్పోయిన దీపా కర్మాకర్, ఏస్ షూటర్ జీతూ రాయ్ రాష్టప్రతి నుంచి రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను అందుకున్నారు. వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రంతోపాటు ఏడున్నర లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభించింది. ఎంతో ఆర్భాటంగా సాగిన కార్యక్రమంలో పలువురు ప్రస్తుత, మాజీ క్రీడాకారులు, ప్రముఖులు పాల్గొన్నారు. దీపా కర్మాకర్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న బిశే్వస్వర్ నందిసహా ఆరుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డును బహూకరించారు. ఈ అవార్డు కింద వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రం, ఏడు లక్షల రూపాయల ప్రైజ్‌మనీ లభించాయి. ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డులతోపాటు 15 మంది క్రీడారులకు అర్జున అవార్డును అందచేశారు. వీరికి కూడా జ్ఞాపిక, ప్రశంసా పత్రంతోపాటు ఐదు లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.

చిత్రం.. రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డు గ్రహీతల గ్రూప్ ఫొటో