క్రీడాభూమి

వరించిన అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పటికీ నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌ను అదృష్టం వరించింది. 2012లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించిన రష్యా రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో ఆ పతకం యోగేశ్వర్ దత్‌కు దక్కింది. లండన్ ఒలింపిక్స్‌లో తాను సాధించిన పతకాన్ని రజతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు మంగళవారం ఉదయమే తెలిసిందని, ఈ పతకాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్నానని యోగేశ్వర్ దత్ ‘ట్విట్టర్’లో వెల్లడించాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించడంతో పాటు ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలను గెలుచుకున్న కుదుఖోవ్ 2013లో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అయితే లండన్ ఒలింపిక్స్ సమయంలో అతను నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని ఉపయోగించినట్లు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షల్లో తేలిందని రష్యన్ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో లండన్ ఒలింపిక్స్ పురుషుల 60 కిలోల విభాగంలో యోగేశ్వర్ దత్ సాధించిన కాంస్య పతకాన్ని రజత పతకానికి మార్చడంతో అతను 2012లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన రెజ్లర్ సుశీల్ కుమార్ సరసన చేరాడు. కొద్ది రోజుల క్రితం ముగిసిన రియో ఒలింపిక్స్ పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో కుదుఖోవ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అయితే ఆ పోటీలో కుదుఖోవ్ ఫైనల్‌కు చేరడంతో యోగేశ్వర్ దత్‌కు రెపిచేజ్ రౌండ్‌లో మరో అవకాశం లభించింది. దీంతో అతను ఆ రౌండ్‌లో విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.