క్రీడాభూమి

పాండే శతకం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్‌కే (ఆస్ట్రేలియా), ఆగస్టు 30: నాలుగు దేశాల వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ ఆతిథ్య ఆస్ట్రేలియా-ఎ జట్టుతో ఉత్కంఠ భరితంగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 322 పరుగులు రాబట్టగా, ఇండియా-ఎ జట్టు 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు సాధించి తృటిలో విజయానికి దూరమైంది. దీంతో ఇండియా-ఎ జట్టు కెప్టెన్ మనీష్ పాండే శతకం వృథా అయింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా-ఎ జట్టు పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా-ఎ జట్టును కిందికి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లడంతో పాటు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే రౌండ్ రాబిన్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న ఇండియా-ఎ జట్టుకు ఈ ఓటమితో ఎటువంటి నష్టం వాటిల్లలేదు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇండియా-ఎ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 16 పరుగులకే నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ మార్కస్ స్టోయినిస్ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఓపెనర్ కర్టిస్ ప్యాటర్‌సన్‌తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ నిక్ మాడిసన్ క్రీజ్‌లో నిలదొక్కుకుని భారత బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. చక్కటి సమన్వయంతో చూడముచ్చటగా ఆడిన వీరు చెరో శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు రెండో వికెట్‌కు 230 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించి ఆతిథ్య జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. అనంతరం ప్యాటర్‌సన్ (123 బంతుల్లో 115 పరుగులు) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్‌కు దొరకిపోగా, మాడిసన్ (117 బంతుల్లో 118 పరుగులు)ను శార్ధూల్ థాకూర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కేవలం ఐదు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా-ఎ జట్టులో కెప్టెన్ పీటర్ హ్యాడ్స్‌కూంబ్ (9), అలెక్స్ రాస్ (17)తో పాటు వికెట్‌కీపర్ శామ్ వైట్‌మన్ (14) స్వల్పస్కోర్లకే నిష్క్రమించగా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ (21), కాన్ రిచర్డ్‌సన్ (4) నాటౌట్‌గా నిలిచారు. దీంతో ఆస్ట్రేలియా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది.
అనంతరం భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఎ జట్టులో ఓపెనర్ ఫరుూజ్ ఫైజల్ (12)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ (13) విఫలమైనప్పటికీ కెప్టెన్ మనీష్ పాండే క్రీజ్‌లో నిలదొక్కుకుని ఆతిథ్య బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. మూడో వికెట్‌కు నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (56)తో కలసి 44 పరుగులు, నాలుగో వికెట్‌కు జయదేవ్ ఉనద్కత్ (20)తో కలసి 32 పరుగులు, నాలుగో వికెట్‌కు వికెట్‌కీపర్ సంజూ శ్యాంసన్‌తో కలసి 157 పరుగులు జోడించిన మనీష్ పాండే మొత్తం మీద 91 బంతుల్లో 110 పరుగులు సాధించి నిష్క్రమించాడు. ఆ తర్వాత సంజూ శ్యాంసన్ (74 బంతుల్లో 87 పరుగులు) కొద్దిసేపు పోరాడినప్పటికీ హార్దిక్ పాండ్యా (2), శార్ధూల్ థాకూర్ (0) చేతులెత్తేయడంతో 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 321 పరుగులు రాబట్టిన ఇండియా-ఎ జట్టు 1 పరుగు తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. అప్పటికి జయంత్ యాదవ్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరుతో నాటౌట్‌గా నిలిచాడు.
మనీష్ పాండే (91 బంతుల్లో 110 పరుగులు)