క్రీడాభూమి

కిర్మానీకి అవార్డు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: భారత మాజీ వికెట్‌కీపర్ సయ్యద్ కిర్మానీని బిసిసిఐ మంగళవారం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద సికె నాయుడు అవార్డుతో సత్కరించింది. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశాడు. 66 ఏళ్ల కిర్మానీ 1983లో ప్రపంచ కప్‌ను సాధించిన కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టులో సభ్యుడు. కాగా, భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ‘బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ కింద పాలీ ఉమ్రీగర్ అవార్డు లభించింది.
అవార్డు గ్రహీతల వివరాలు
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద సికె నాయుడు అవార్డు: సయ్యద్ కిర్మానీ.
బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కింద పాలీ ఉమ్రీగర్ అవార్డు: విరాట్ కోహ్లీ.
లాలా అమర్‌నాథ్ అవార్డులు: రంజీల్లో ఉత్తమ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా, దేశవాళీ పోటీల్లో ఉత్తమ ఆల్‌రౌండర్ దీపక్ హూడా.
మాధవరావు సింధియా అవార్డు: రంజీలో అత్యధిక స్కోరర్ రాబిన్ ఉతప్ప, అత్యధిక వికెట్లు సాధించిన వినయ్ కుమార్.
ఎంఎ చిదరంబరం అవార్డులు: అండర్-23 అల్మాస్ షౌకత్, అండర్-16 శుభం గిల్, ఉత్తమ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ఉత్తమ జూనియర్ మహిళా క్రికెటర్ దేవిక విద్య, ఉత్తమ అంపైర్ నందన్.