క్రీడాభూమి

ఆ పతకం నాకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: తాను గొప్ప రెజ్లర్‌నేగాక, మానవతా వాదినని కూడా నిరూపించుకున్నాడు యోగేశ్వర్ దత్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అతనిని అదృష్టం వరించి, రజత పతకం దక్కనున్న విషయం తెలిసిందే. లండన్‌లో రజత పతకాన్ని సాధించిన జార్జియా రెజ్లర్ బెసిక్ కుడఖోవ్ డోపింగ్ పరీక్షలో విఫలమైనట్టు అధికారులు ప్రకటించారు. అతనిని అనర్హుడిగా ప్రకటిస్తూ, మూడో స్థానంలో ఉన్న యోగేశ్వర్‌కు రజత పతకాన్ని అందించాలని నిర్ణయించారు. అయితే, తనకు పతకం కంటే మానవత్వమే ప్రధానమని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. కుడఖోవ్ మృతి చెందిన తర్వాత అతను డోపింగ్ పరీక్షలో విఫలమైనట్టు నివేదిక రావడం విచారకమని పేర్కొన్నాడు. ఒక రెజ్లర్‌గా మరో రెజ్లర్‌ను తాను గౌరవిస్తానని, తన దృష్టిలో కుడఖోవ్ అద్భుతమైన కుస్తీ వీరుడని యోగేశ్వర్ ప్రశంసించాడు. తనకు రజత పతకం వద్దని, వీలుంటే దానిని కుడఖోవ్ కుటుంబీకుల వద్దే ఉంచాలని అధికారులను కోరాడు. దీని వల్ల అతని కుటుంబ ప్రతిష్ట కూడా నిలబడుతుందని అన్నాడు. తాను పతకం కంటే మానవీయ విలువలకే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశాడు.
డోప్ పరీక్షకు శాంపిల్స్
యోగేశ్వర్‌కు ఒలింపిక్స్ రజత పతకాన్ని అందించే ముందు, అతని శాంపిల్స్‌ను కూడా పరీక్షించనున్నట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ప్రకటించింది. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన కుడఖోవ్ డోప్ పరీక్షలో విఫలం కావడంతో, మూడో స్థానంలో నిలిచిన యోగేశ్వర్‌కు రెండో స్థానం ఖరారైంది. అయితే, కాంస్యం స్థానంలో రజత పతకాన్ని ఇవ్వడానికి ముందే యోగేశ్వర్ అప్పట్లో ఇచ్చిన మూత్రం శాంపిల్స్‌ను మరోసారి పరీక్షించనున్నట్టు వాడా ప్రకటించింది. నిబంధనలను అనుసరించి ఇది అవసరమని తెలిపింది.

ఢిల్లీ సచివాలయంలో బుధవారం జరిగిన సన్మాన కార్యక్రమానికి హాజరైన
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్.
(పక్కన) బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో పతకాలను గెల్చుకున్న రెజ్లర్ సుశీల్ కుమార్