క్రీడాభూమి

పూర్తి ఫిట్నెస్ అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఒకసారి గాయపడితే, మళ్లీ పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించుకోవడం కష్టమని భారత బాడ్మింటన్ క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్ అన్నాడు. ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న అతను గురువారం పిటిఐతో మాట్లాడుతూ తొలుత మోకాలి నొప్పి తీవ్రంగా వేధించిందని చెప్పాడు. అది కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత వెన్నునొప్పి వెంటాడిందని అన్నాడు. సుమారు మూడు వారాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత, ఇప్పుడు తాను కోలుకున్నానని, ఇండోనేషియా టోర్నీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. 2012లో ఈ టోర్నీని సాధించిన విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, ఆతర్వాత రెండు సంవత్సరాలు గాయాల సమస్య తనను వేధించిందని అన్నాడు. మోకాలి నొప్పి నుంచి కోలుకుంటే, వెన్నునొప్పి బాధపెట్టిందని తెలిపాడు. నిజానికి ఇవి రెండూ పూర్తిగా తగ్గేవి కావని, అందుకే, గతంలో మాదిరి సంపూర్ణ ఫిట్నెస్‌ను సాధించడం అసాధ్యమని స్పష్టం చేశాడు. కానీ, సాధ్యమైనంత వరకూ గాయాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంటుందని అన్నాడు.