క్రీడాభూమి

జర్మనీ సాకర్ కెప్టెన్ ష్వెన్‌స్టిగర్‌కు విజయంతో వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ), సెప్టెంబర్ 1: అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన జర్మనీ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ బాస్టియన్ ష్వెన్‌స్టిగర్‌కు సహచరులు విజయాన్ని అందించి, ఘనంగా వీడ్కోలు పలికారు. జర్మనీ జాతీయ జట్టుకు అతను చివరిసారి, ఇక్కడ ఫిన్లాండ్‌తో జరిగిన ఓ స్నేహపూర్వక మ్యాచ్‌లో నాయకత్వం వహించాడు. 2-0 తేడాతో విజయాన్ని సాధించిపెట్టాడు. మ్యాచ్ పూర్తయిన వెంటనే ష్వెన్‌స్టిగర్‌ను సహచరులంతా ఎత్తుకొని, గాల్లోకి ఎగరవేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. స్టేడియంలో మ్యాచ్‌ని తిలకించిన వేలాది మంది అభిమానులు ప్లకార్డులు పట్టుకొని, చప్పట్లు కొడుతుండగా, ష్వెన్‌స్టిగర్ వారికి అభివాదం చేస్తూ ‘ఫైనల్ ల్యాప్’ను పూర్తి చేశాడు. మ్యాచ్ నిర్వాహకులు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చినప్పుడు కన్నీరు పెట్టుకున్నాడు. అభిమానులను, సహచరులను విడిచిపెట్టడం ఎంతో బాధగా ఉందని, కానీ, ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి కెరీర్‌లో తప్పదని వ్యాఖ్యానించాడు. 2004లో జర్మనీ జట్టులోకి అడుగుపెట్టిన అతను 121 మ్యాచ్‌లు ఆడాడు.
కెప్టెన్ బ్యాండ్‌తోనే..
మ్యాచ్ పూర్తయి, విక్టరీ పరేడ్ పూర్తయ్యే వరకూ ష్వెన్‌స్టిగర్ కెప్టెన్ బ్యాండ్‌తోనే కనిపించాడు. వాస్తవానికి మ్యాచ్ చివరిలో అతను కొత్త కెప్టెన్‌కు ఆ బ్యాండ్‌ను అందచేయాలి. కానీ, దానిని తీసేందుకు ష్వెన్‌స్టిగర్ నిరాకరించడంతో, కొంత సేపు జర్మనీ జట్టుకు నాయకుడు లేకుండా పోయాడు. అయితే, థామస్ ముల్లర్ తన వద్ద ఉన్న కెప్టెన్ బ్యాండ్‌ను ధరించి మైదానంలోకి దిగడంతో, గందరగోళానికి తెరపడింది.

చిత్రాలు.. ష్వెన్‌స్టిగర్‌ను ఎత్తుకొని, గాల్లోకి ఎగరేస్తున్న సహచరులు
కన్నీరు పెట్టుకున్న ష్వెన్‌స్టిగర్