క్రీడాభూమి

బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా వాల్ష్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, సెప్టెంబర్ 1: బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ పేసర్ కొట్నీ వాల్ష్‌ను నియమించినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు (బిసిబి) ఒక ప్రకటనలో తెలిపింది. వాల్ష్ పర్యవేక్షణలో తమ దేశ యువ బౌలర్లు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఈ బాధ్యతను స్వీకరించడం తనకు ఎంతో ఆనందాన్నిస్తున్నదని వాల్ష్ ఫోన్ ద్వారా ఒక చానెల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. బంగ్లాదేశ్‌లో సమర్థులు ఎంతో మంది ఉన్నారని, వారికి సరైన దిశానిర్దేశనం చేయడమే తన లక్ష్యమని అన్నాడు. త్వరలోనే బంగ్లాదేశ్ వెళతానని చెప్పాడు.

చిత్రం.. కొట్నీ వాల్ష్