క్రీడాభూమి

‘మినీ ఐపిఎల్’కు బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాడెర్‌హిల్, సెప్టెంబర్ 1: అమెరికా లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈనెల నిర్వహించాలని తలపెట్టిన ‘మినీ ఐపిఎల్’కు బ్రేక్ పడింది. అమెరికా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ టోర్నీని నిర్వహించాలని బిసిసిఐ తొలుత భావించింది. అదే విధంగా యుఎఇని కేంద్రంగా చేసుకునే అంశాన్ని కూడా పరిశీలించింది. సెప్టెంబర్‌లో ఈ టోర్నీ ఉంటుందని ఇది వరకే ప్రకటించింది. కానీ, ప్రస్తుతానికి ఆ ఆలోచనను వాయిదా వేసుకున్నామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెప్పాడు. ఇఎస్‌పిఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ లభిస్తుందని, భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు వచ్చిన స్పందనే దీనికి నిదర్శనమని అన్నాడు. అయితే, భారత్‌లోని లక్షలాది మంది అభిమానులు మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉంటేనే ‘మినీ ఐపిఎల్’ విజయవంతమవుతుందని స్పష్టం చేశాడు. భారత్‌లో సహజంగా మ్యాచ్‌లను రాత్రి 7 గంటల నుంచి 11 లేదా 11.30 గంటల వరకూ తిలకిస్తారని, ఆయా సమయాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలను అమెరికాలో వెతుక్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. టైమ్ జోన్‌తోపాటు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రేక్షకుల స్పందనపైనా దృష్టి సారించాల్సి వస్తుందని అన్నాడు. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని, సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఐపిఎల్‌ను భారత్‌లో కాకుండా ఇరత దేశాల్లో నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అసలు అలాంటి ఆలోచనే బిసిసిఐకి లేదన్నాడు. అమెరికా మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని ఠాకూర్ అన్నాడు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపాడు.

చిత్రం.. అనురాగ్ ఠాకూర్