క్రీడాభూమి

మూసుకున్న పైకప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ చరిత్రలోనే తొలిసారి ఆర్థర్ అషే స్టేడియం పైకప్పును మూశారు. రాఫెల్ నాదల్, ఆండ్రియాస్ సెప్పీ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. దీనితో స్టేడియం రూఫ్‌ను మూసేసి, ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆటను కొనసాగించారు. పైకప్పును మూసేయడానికి సుమారు ఏడున్నర నిమిషాల సమయం పట్టింది. వర్షం కురిసినప్పుడు మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడి, షెడ్యూల్‌లో భారీ మార్పులు అనివార్యంగా మారడంతో అవసరమైనప్పుడు మూసి వేసే విధంగా రూఫ్‌ను నిర్మించారు. మూయడానికి వీలున్న రూఫ్‌ను మొదటిసారి వినియోగంలోకి తెచ్చారు. రూఫ్ మూయక ముందు, ఆతర్వాత తనకు చెప్పుకోతగ్గ మార్పేమీ కనిపించలేదని నాదల్ వ్యాఖ్యానించాడు. తన దృష్టిలో రెండూ ఒకటేనని, ఇలాంటి రూఫ్ ఉంటే, వర్షం వల్ల ఇబ్బందులు ఉండవని అన్నాడు.