క్రీడాభూమి

యుఎస్ ఓపెన్ ట్రివియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని కెరీర్ శ్లామ్‌ను సాధించిన తొలి ఆటగాడు ఫ్రెడ్ పెర్రీ. టేబుల్ టెన్నిస్‌లోనూ అతను ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తింపు సంపాదించాడు. అటు టెన్నిస్, ఇటు టేబుల్ టెన్నిస్‌లో మేజర్ టోర్నీలను గెల్చుకున్న ఏకైక క్రీడాకారుడు అతను.
* అమెరికా ఆటగాడు విక్ సీక్సాస్ 1940-1969 మధ్యకాలంలో 28 సార్లు యుఎస్ ఓపెన్‌లో పాల్గొన్నాడు. అత్యధిక పర్యాయాలు యుఎస్ ఓపెన్‌లో పాల్గొన్న క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.
* యుఎస్ ఓపెన్‌కు సుమారు 80 మంది బాల్ బాయిస్, బాల్ గరల్స్‌గా సేవలు అందిస్తారు.
* మొట్టమొదిసారి యుఎస్ ఓపెన్‌లో ఆడిన ఆఫ్రికన్-అమెరికన్ అల్‌థియా గిబ్సన్. 1950లో తొలిసారి
* టెన్నిస్‌ను 16వ శతకంలోనే ఆడినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. మొదట్లో ఈ క్రీడకు పేరు ఉండేదికాదు. ఆటగాళ్లు బంతిని కొట్టే సమయంలో ‘టెనెజ్’ అని అరిచేవారు. ఆ పదం ఆధారంగానే టెన్నిస్ అన్న పదం స్థిరపడింది. ఒలింపిక్ క్రీడగా ఎదిగిన ఈ క్రీడను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7.5 కోట్ల మంది ఆడతారని అంచనా.
* యుఎస్ ఓపెన్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల నుంచి మొదలు పెడితే ఫైనల్ వరకూ సుమారు 70,000 బంతులను ఉపయోగిస్తారు.
* జువాన్ డెల్ పొట్రో, రోజర్ ఫెదరర్ మధ్య 2009లో పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరు జరిగింది. ఆ మ్యాచ్‌ని పొట్రో3-6, 7-6, 4-6, 7-6, 6-2 తేడతో సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకూ ఫెదరర్ కొనసాగిస్తున్న జైత్రయాత్రకు ఆ మ్యాచ్‌తో తెరపడింది. అంతేగాక, పొట్రో కెరీర్‌లో మొట్టమొదటిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌ని 7,21,059 మంది తిలకించారు. యుఎస్ ఓపెన్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. అంత భారీగా ప్రేక్షకులు అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ ఎన్నడూ హాజరుకాలేదు.
* స్టేడియంలోకి త్వరగా వచ్చి కూర్చున్న వారు టీవీ కవరేజీలో ప్రముఖంగా కనిపిస్తారన్న ప్రచారం యుఎస్ ఓపెన్‌కు బాగా కలిసొచ్చింది. టోర్నమెంట్ జరిగినన్ని రోజులూ ప్రతి మ్యాచ్‌కీ ప్రేక్షకులు చాలా ముందుగానే రావడం ఆనవాయితీగా మారింది. అందుకే తోపులాటలు, ఘర్షణలు యుఎస్ ఓపెన్‌లో సామాన్యంగా కనిపించవు. ఒకరు ఒకటి కంటే ఎక్కువ బ్యాగ్‌లు లోనికి తీసుకెళ్లడానికి అనుమతించరు.
* బేస్ బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు గ్లోవ్స్‌ను తొడుక్కొని వెళ్లవచ్చు. కానీ, యుఎస్ ఓపెన్‌కు టెన్నిస్ ర్యాకెట్‌ను తీసుకెళ్లడం నిషిద్ధం.
* పిల్లల్ని ఉచితంగానే అనుమతిస్తారు. అయితే, వారు తప్పనిసరిగా తల్లిదండ్రుల ఒళ్లోనే కూర్చోవాలి.