క్రీడాభూమి

స్పాట్ ఫిక్సింగ్ కేసుపై నిర్ణయం.. 18కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) క్రమశిక్షణ కమిటీ ఈనెల 18కి వాయిదా వేసింది. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అజిత్ చండీలా, ముంబయి మాజీ క్రికెటర్ హికేన్ షాతోపాటు ఈ కేలో పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్‌పై తీసుకునే చర్యలను ఖరారు చేయాల్సి ఉండింది. మంగళవారం ఉదయం బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వంలో, జ్యోతిరాదిత్య సింధియా, నిరంజన్ షా సభ్యులుగా ఉన్న క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. అయితే, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం అవసరమని రవూఫ్ కోరడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో శ్రీశాంత్, అంకిత్ చవాన్‌తోపాటు 2013లో చండీలా కూడా అరెస్టయిన విషయం తెలిసిందే. ఆతర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.
‘దులీప్’లో డే/నైట్ మ్యాచ్‌లు!
దులీప్ ట్రోఫీలో డే/నైట్ మ్యాచ్‌లను ప్రవేశపెట్టాలని బిసిసిఐకి టూర్ అండ్ ప్రోగ్రామ్ ఫిక్చ్సర్స్ కమిటీ ప్రతిపాదించింది. ఇటీవల అడెలైడ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన డే/నైట్ టెస్టు మ్యాచ్ ఘన విజయం కావడంతో, అదే తరహా మ్యాచ్‌లను అన్ని ఫార్మెట్స్‌లోనూ ప్రవేశపెట్టాలని ఈ కమిటీ సూచిస్తున్నది. అందులో భాగంగానే దులీప్ ట్రోఫీలో డే/నైట్ మ్యాచ్‌లకు అంగీకరించాలని బిసిసిఐని కోరింది. అయతే, ఈ ప్రతి పాదనకు బిసిసిఐ ఏ విధంగా స్పందిస్తుం దనేది ఉత్కంఠ రేపుతున్నది. సానుకూలం గానే నిర్ణయం తీసుకోచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.