క్రీడాభూమి

రోనిక్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 1: ‘జెయింట్ కిల్లర్’ మిలోస్ రోనిక్ యుఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అతను క్వాలిఫయర్ ర్యాన్ బారిసన్‌ను ఢీకొని, 7-6, 5-7, 5-7, 1-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. కెరీర్‌లో నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ వంటి హేమాహేమీలను ఓడించిన రికార్డు ఉన్న రోనిక్ టైటిల్ రేసులో ఉన్న ఆటగాళ్లలో కీలకంగా లేకపోయినా, ఓటమిపాలయ్యేలోగా ఒకరిద్దరు స్టార్లను ఇంటిదారి పట్టించే సత్తావున్న వాడిగా గుర్తింపు పొందాడు. కానీ, అతని పోరాటం ఆరంభంలోనే ముగిసింది.

చిత్రం.. మిలోస్ రోనిక్