క్రీడాభూమి

బొపన్న, పేస్, సానియా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 1: యుఎస్ ఓపెన్‌లో ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్లు రోహన్ బొపన్న, లియాండర్ పేస్, సానియా మీర్జా తమతమ విభాగాల్లో శుభారంభం చేశారు. డెన్మార్క్‌కు చెందిన ఫ్రెడెరిక్ నీల్సన్‌తో కలిసి పురుషుల డబుల్స్ ఆడుతున్న బొపన్న 6-3, 6-7, 6-3 స్కోరుతో రాడెక్ స్టెపానెక్, నెనాద్ జిమోజిక్ జోడీని ఓడించాడు. మార్టినా హింగిస్‌తో మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ పేస్ వరుస సెట్లలో గెలిచాడు. పేస్, హింగిస్ జోడీ 6-3, 6-2 తేడాతో సచియా వికెరీ, ఫ్రానె్సస్ తిఫో జోడీని సునాయాసంగా ఓడించింది. ఇక మహిళల డబుల్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా స్ట్రికోవాను భాగస్వామిగా చేసుకున్న సానియా 6-3, 6-2 ఆధిక్యంతో అమెరికాకు చెందిన జడా మైయి హార్ట్, ఎనా షిబహరా జోడీపై విజయభేరి మోగించి, రెండో రౌండ్ చేరింది.

చిత్రం.. ముందడుగు వేసిన రోహన్ బొపన్న, లియాండర్ పేస్, సానియా మీర్జా