క్రీడాభూమి

యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ముగురుజా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 1: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న గార్బెన్ ముగురుజా యుఎస్ ఓపెన్ రెండో రౌండ్ నుంచే నిష్క్రమించింది. రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించాలన్న ఆమె కల సాకారం కాలేదు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ముగురుజా యుఎస్ ఓపెన్‌లో గట్టిపోటీనిస్తుందని అంతా ఊహించారు కానీ, రెండో రౌండ్‌లోనే ఆమె పోరాటానికి తెరపడింది. ఆస్ట్రియా క్రీడాకారిణి అనస్తాసిజా సెవస్టోవా 7-5, 6-4 ఆధిక్యంతో ముగురుజాను ఓడించి మూడో రౌండ్ చేరింది. ఈ ఏడాది యుఎస్ ఓపెన్‌లో నమోదైన అనూహ్య ఫలితాల్లో ఇది ఒకటి. కాగా, రెండో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ 6-2, 7-6 ఆధిక్యంతో మిర్జానా లూసిక్ బరోనీని ఓడించింది. ఏడో సీడ్ రాబర్టా విన్సీ 6-1, 6-3 స్కోరుతో క్రిస్టినా మెక్‌హాలెపై గెలిచి మూడో రౌండ్ చేరింది. ఎనిమిదో సీడ్ మాడిసన్ కీస్ 6-1, 6-1 స్కోరుతో కేలా డేను చిత్తుచేసింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి 6-4, 6-4 ఆధిక్యంతో తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి స్వెత్లానా కుజ్నెత్సొవాపై విజయం సాధించింది. పెట్రా క్విటోవా 7-6, 6-3 తేడాతో కాగ్లా బయుకకేపై గెలిచింది.

చిత్రం.. యుఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లోనే ఓడిన ముగురుజా