క్రీడాభూమి

మా ఆయన్ని వేధించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: తన భర్తపై విమర్శలు గుప్పిస్తూ, వేధించడాన్ని మానుకోవాలని భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య మాయంతి లాంగర్ ట్వీట్ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు సంతోషిస్తారేమోగానీ, బాధితులు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దుర్భరంగా ఉంటుందని టీవీ ప్రెజెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆమె పేర్కొంది. పనిలేని వారు ఉద్దేశపూర్వకంగా స్టువర్ట్‌ను వేధిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టి-20లో స్టువర్ట్ కేవలం ఒక ఓవర్ బౌల్ చేసి, ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. విండీస్ ఓపెనర్ ఇవిన్ లూయిస్ ఆ ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదాడు. ఆ మ్యాచ్‌లో స్టువర్ట్ బౌలింగ్ స్పెల్ ఒక ఓవర్‌తోనే ముగిసింది. కాగా, భారీగా పరుగులిచ్చిన అతనిపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ జట్టులోకి అతని ఎంపికపైనా కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, ఈ విధంగా విమర్శించడం మంచిది కాదని, అభిమానానికీ ఒక హద్దు ఉండాలని మాయంతి పేర్కొంది.