క్రీడాభూమి

చడీ చప్పుడు లేకుండా.. కింగ్‌స్టన్‌కు బోల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, సెప్టెంబర్ 2: రియో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని, ఒకానొక దశలో ఆ మెగా ఈవెంట్‌లో పాల్గొనడమే అనుమానంగా కనిపించినప్పటికీ, మూడు స్వర్ణ పతకాలను సాధించి సత్తాచాటిన జమైకా స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఎలాంటి చడీచప్పుడు లేకుండా కింగ్‌స్టన్ చేరాడు. అతని రాక గురించి ముందుగానే తెలిస్తే, అభిమానులు ఇక్కడి నార్మన్ మానే్ల అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో వచ్చి ఉండేవాళ్లు. కానీ, బోల్ట్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కింగ్‌స్టన్‌లో అడుగుపెట్టాడు. అక్కడ తనను గుర్తించిన వారిని చూసి నవ్వుతూ, అతి కొద్ది మందికి సెల్ఫీలు తీసుకునే అవకాశం ఇస్తూ ముందుకు సాగాడు. అక్కడే ఉన్న కొంత మంది విలేఖరులు ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించగా, ఇప్పుడు కాదంటూ కారులో ఇంటికి వెళ్లిపోయాడు.
చుట్టుముట్టిన ఫిట్నెస్ సమస్యలు
రియో ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందు బోల్ట్‌ను ఫిట్నెస్ సమస్యలు చుట్టుముట్టాయి. పాత గాయాలకు కాలి కండరాలు బెణకడం కూడా జత కలవడంతో అతను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగా కనిపించింది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బోల్ట్ జమైకా నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జరిగిన ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. అయితే, కండరాల నొప్పికారణంగా రెండు వందల మీటర్ల పరుగును పూర్తి చేయలేకపోయాడు. నిరుడు చాలాకాలం వెన్నునొప్పితో బాధపడిన బోల్ట్ కొన్ని అంతర్జాతీయ ఈవెంట్స్‌కు గైర్హాజరయ్యాడు. అంతకు ముందు చాలా కాలం నుంచి బాధిస్తున్న వెన్నునొప్పి ఒకానొక దశలో అతని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టింది. రియో ఒలింపిక్స్‌కు ముందు కాలి కండరాలు సమస్య తలెత్తింది. దీనితో అతను జర్మనీకి వెళ్లి ప్రత్యేకంగా ఫిట్నెస్‌కు వైద్య సేవలు తీసుకున్నాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసి, వైద్య నిపుణుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న బోల్ట్ రియోలో అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలే విభాగంలోనూ స్వర్ణ పతకాన్ని సాధించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఈ ఫీట్‌ను ప్రదర్శించిన ఏకైక అథ్లెట్‌గా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. ట్రిపుల్ ‘ట్రెపుల్’ను అందుకొన్న బోల్ట్‌కు స్వదేశంలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే అతను ఎలాంటి ఆర్భాటం లేకుండా స్వదేశానికి చేరుకున్నాడు. లేకపోతే, విమానాశ్రయ ప్రాంతమంతా అభిమానులతో కిటకిటలాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి.