క్రీడాభూమి

ఎఐటిఎ లైఫ్ ప్రెసిడెంట్‌గా అనిల్ ఖన్నా ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, సెప్టెంబర్ 3: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) లైఫ్ ప్రెసిడెంట్‌గా అనిల్ ఖన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే క్రీడా విధివిధానాలు ఇంకా ఖరారు కానందున అతను బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించాడు. శనివారం ఇక్కడ జరిగిన ఎఐటిఎ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఖన్నాను లైఫ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. 23 సభ్య సంఘాల ప్రతినిధులంతా ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే ఎస్‌ఎం కృష్ణ, అశ్వంత్ సిన్హా లైఫ్ ప్రెసిడెంట్స్‌గా కొనసాగుతుండగా ఆ జాబితాలో ఖన్నా కూడా చేరాడు. ఆసియా టెన్నిస్ సమాఖ్యకు అధ్యక్షుడిగా, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యకు ఉపాధ్యడిగా కూడా వ్యవహరిస్తున్న ఖన్నా చాలాకాలం ఎఐటిఎ అధ్యక్షుడిగానూ సేవలు అందించాడు. అతనితోపాటు గౌరవ ప్రధాన కార్యదర్శిగా హిరణ్మయి చటర్జీ, గౌరవ సంయుక్త కార్యదర్శులుగా సుమన్ కపూర్, అనీల్ ధుపర్‌లను కూడా సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పది మంది ఉపాధ్యక్షులు, పనె్నండు మంది కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. అయితే, లైఫ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను తాను ఇప్పుడే స్వీకరించబోనని ఖన్నా స్పష్టం చేశాడు. ముకుల్ ముద్గల్ కమిటీ చేసిన సూచనల మేరకు భారత క్రీడా రంగంలో అనుసరించాల్సిన విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటి వరకూ తాను బాధ్యతలను స్వీకరించడంలో అర్థం ఉండదని స్పష్టం చేశాడు.

చిత్రం..అనిల్ ఖన్నా