క్రీడాభూమి

అంత మొత్తమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: చాంపియన్స్ ట్రోఫీ నిర్వాహణకుగాను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి ఏకంగా 135 మిలియన్ డాలర్లను చెల్లించాలన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈఏడాది మార్చి 8 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు భారత్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను నిర్వహించారు. అప్పుడు బిసిసిఐకి చెల్లించిన మొత్తం 45 మిలియన్ డాలర్లు మాత్రమే. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి 18వ తేదీ వరకు, కేవలం పురుషుల విభాగంలోనే ఈ టోర్నీ మ్యాచ్‌లకు ఇసిబి ఆతిథ్యమిస్తుంది. మొత్తం మీద 15 మ్యాచ్‌లే ఉంటాయి. భారత్‌లో పురుషుల విభాగంలో 35, మహిళల విభాగంలో 23 చొప్పున మొత్తం 58 మ్యాచ్‌లు జరిగాయి. అప్పట్లో తాము నిర్వహించిన మ్యాచ్‌ల్లో మూడో వంతు సంఖ్యలో కూడా మ్యాచ్‌లు లేవని, కానీ, కేటాయించిన మొత్తం మాత్రం మూడు రెట్లు ఉందని బిసిసిఐ మండిపడుతున్నది. ఇంత వ్యత్యాసాన్ని ఎందుకు చూపెడుతున్నారంటూ ఐసిసికి లేఖరాసింది. ఈనెల 6, 7 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఐసిసి కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని భారత్ లేవనెత్తడం ఖాయంగా కనిపిస్తున్నది. ఐసిసి వార్షిక సమావేశం వచ్చే ఏడాది మే-జూన్ మాసాల్లో జరగే అవకాశం ఉంది. ఆ సమావేశంలోనే చాంపియన్స్ ట్రోఫీకి కేటాయింపులుసహా అన్ని రకాల జమాఖర్చులను ఆమోదించాల్సి ఉంటుంది. బిసిసిఐ తీవ్ర స్థాయిలో అభ్యంతరా లు వ్యక్తం చేస్తే, ఇసిబికి ఐసిసి ఈ భారీ మొత్తాన్ని చెల్లించడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇసిబికే కార్యాలయ భవనం
చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకొని లండన్‌లో ఐసిసి ఒక కార్యాలయ భవానాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో ఈ టోర్నీ ముగిసిన వెంటనే దానిని ఇసిబికే అప్పగించాలని ఐసిసి అనుకోవడం కూడా బోర్డు ఆగ్రహానికి కారణమవుతున్నది.