క్రీడాభూమి

మెస్సీకి గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, సెప్టెంబర్ 3: అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ గాయపడ్డాడు. ఫలితంగా, 2018 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా వెనుజులాతో జరిగే మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండడు. అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహింబోవడం లేదని ఇటీవల ప్రకటించిన మెస్సీ ఆతర్వాత మనసు మార్చుకున్న విషయం తెలిసిందే. క్వాలిఫయర్స్ మొదటి మ్యాచ్‌లో ఉరుగ్వేను ఢీకొన్న అర్జెంటీనాకు అతను చేసిన కీలక గోల్ విజయాన్ని సాధించిపెట్టింది. అయితే, ఆ మ్యాచ్‌లోనే మెస్సీ కండరాలు బెణికాయని, అతనికి విశ్రాంతి అవసరమని అర్జెంటీనా కోచ్ ఎగార్డో బౌజా ప్రకటించాడు. వెనుజులాతో జరిగే మ్యాచ్ నుంచి అతనికి విశ్రాంతినిస్తున్నట్టు తెలిపాడు.