క్రీడాభూమి

బంగ్లాదేశ్ పర్యటనపై మోర్గాన్ మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లాలా? లేదా? అన్నది తేల్చుకోలేకపోతున్న ఇంగ్లాండ్ వనే్డ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మల్లగుల్లాలు పడుతున్నాడు. అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో బంగ్లాదేశ్ పర్యటకు వెళ్లాల్సిన ఇంగ్లాండ్ అక్కడ మూడు వనే్డ ఇంటర్నేషనల్స్, రెండు టెస్టులు ఆడాలి. బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ తీవ్రవాదులు జూలై నెలలో దాడికి తెగబడి, 20 మందిని బందీలుగా చేసుకొని, ఆతర్వాత వారిని క్రూరంగా హతమార్చిన సంఘటన సంచలనం సృష్టించింది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులే కావడంతో బంగ్లాదేశ్‌లో పర్యటనకు వివిధ దేశాల క్రికెటర్లు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఇటీవలే బంగ్లాదేశ్‌కు భద్రతా విభాగం చీఫ్ రెగ్ డిక్సన్ ఆధ్వర్యంలో ఒక అధ్యయన బృందాన్ని పంపింది. ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా, బంగ్లాదేశ్ టూర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ప్రకటించింది. అయితే, వనే్డ జట్టు సభ్యులు ఎవరూ ఇప్పటి వరకూ అంగీకారాన్నిగానీ, తిరస్కారాన్ని కానీ తెలపలేదు. మోర్గాన్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నపై దాటవేత ధోరణిని అనుసరించాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం పాకిస్తాన్‌తో జరుగుతున్న సిరీస్‌పైనే కేంద్రీకృతమైందని, కాబట్టి వేరే విషయాలను ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. పాక్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తికాగా, అన్నింటినీ ఇంగ్లాండ్ గెల్చుకుంది. చివరిదైన ఐదో వనే్డ ఆదివారం జరగనుంది. ఇందులోనూ విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే ఇంగ్లాండ్ లక్ష్యంగా ఎంచుకుంది. ఆతర్వాత పాక్‌తోనే జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ జట్టుకు మోర్గాన్ నాయకత్వం వహిస్తాడు. పాక్‌తో సిరీస్ పూర్తయిన తర్వాతే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే విషయాన్ని ఆలోచిస్తానని అతను అన్నాడు. ఈనెల 29న మొదటి వనే్డ ఆడాల్సి ఉన్ననేపథ్యంలో, వారంపది రోజుల్లో మోర్గాన్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని ఇసిబి వర్గాలు భావిస్తున్నాయి.
చిత్రం..ఇయాన్ మోర్గాన్