క్రీడాభూమి

బాక్సర్ సొంగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు జో విల్‌ఫ్రైడ్ సొంగా బాక్సర్ అవతారం ఎత్తి ప్రేక్షకులను కొద్దిసేపు అలరించాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో అతను కెవిన్ ఆండర్సన్‌ను 6-3, 6-4, 7-6 స్కోరుతో ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే సొంగా కాసేపు షాడో బాక్సింగ్ చేశాడు. గాల్లో స్పైరింగ్ చేసి ప్రేక్షకులను ఆనందపరిచాడు. సొంగా గార్డ్ తీసుకునే విధానం, స్పైరింగ్ తీరు ‘లెజెండరీ బాక్సర్’ మహమ్మద్ అలీని తలపిస్తున్నాయంటూ అభిమానులు అతనిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫుట్‌బాల్ లాంటి ఆటల్లో చాలా మంది నైపుణ్యాన్ని ప్రదర్శించారుగానీ, ఇలా బాక్సర్‌గా దర్శనమిచ్చింది సొంగా ఒక్కడే.