క్రీడాభూమి

కెర్బర్ చేతిలో బెలిస్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 3: జర్మనీకి చెందిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ మహిళల సింగిల్స్‌లో సులభంగా ప్రీ క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. మూడో రౌండ్‌లో ఆమె క్వాలిఫయర్ సిసి బెలిస్‌ను 6-1, 6-1 తేడాతో చిత్తుచేసింది. కెర్బర్ విజృంభణకు బెలిస్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోయింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి 6-3, 6-1 స్కోరుతో మోనికా నికలెస్క్యూపై విజయం సాధించింది. ఎనిమిదో సీడ్ మాడిసన్ కీస్ 7-5, 4-6, 7-6 ఆధిక్యంతో జపాన్‌కు చెందిన 18 ఏళ్ల నవోమీ ఒసాకాను ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరింది. ఏడో సీడ్ రాబర్టా విన్సీ 6-0, 5-7, 6-3 తేడాతో కరినా వితాఫ్ట్‌పై గెలిచింది. 14వ స్థానంలో ఉన్న పెట్రా క్విటోవా 6-3, 6-4 స్కోరుతో ఎలినా స్విటోలినాపై విజయం సాధించింది. జొహన్నా కొన్టా 6-2, 6-1 ఆధిక్యంతో బెలిండా బెన్సిక్‌ను ఓడించింది.