క్రీడాభూమి

ఇది తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 3: యుఎస్ ఓపెన్‌ను గ్రాస్, క్లే, హార్డ్ కోర్టులపై గెల్చుకున్న ఘనత ఇద్దరు స్టార్లకే దక్కుతుంది. జిమీ కానర్స్, క్రిస్ ఎవర్ట్ లాయిడ్ ఈ ఫీట్‌ను సాధించారు. 1881 నుంచి గణాంకాలను పరిశీలిస్తే పురుషులు లేదా మహిళల విభాగంలో అమెరికన్లు లేకుండా ఫైనల్ మ్యాచ్‌లు జరిగిన సందర్భాలు ఏడు మాత్రమే. ఓపెన్ శకం మొదలైన తర్వాత అత్యధికంగా ఐదు సార్లు యుఎస్ ఓపెన్ టైటిళ్లను అందుకున్న ఆటగాళ్లు జిమీ కానర్స్, పీట్ సంప్రాస్, రోజర్ ఫెదరర్. ఈ ముగ్గురూ ఐదేసి పర్యాయాలు యుఎస్ ఓపెన్ విజేతలుగా నిలిచారు. ఓపెన్ ఎరా మొదలుకాక ముందు, రిచర్డ్ సియర్స్, బిల్ లార్న్‌డ్, బిల్ టిల్డెన్ ఏడేసి టైటిళ్లు సాధించి రికార్డును పంచుకుంటున్నారు. వీరిలో రిచర్డ్ సియర్స్ వరుసగా ఏడుసార్లు విజేతగా నిలవడం విశేషం. ఓపెన్ ఎరా మొదలైన తర్వాత ఐదు వరుస విజయాలతో రోజర్ ఫెదరర్ రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు.
సంప్రాస్, ఆస్టిన్ రికార్డులు
యుఎస్ ఓపెన్ పురుషుల విభాగంలో పీట్ సంప్రాస్ 19 సంవత్సరాల ఒక నెల వయసులో టైటిల్ సాధించాడు. మహిళల విభాగంలో ట్రాసీ ఆస్టిన్ టైటిల్ గెల్చుకున్నప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాల 8 నెలలు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన పిన్న వయస్కులుగా వీరు రికార్డు నెలకొల్పారు. కాగా, విలియమ్ లార్నెడ్ పురుషుల విభాగంలో టైటిల్ సాధించినప్పుడు అతని వయసు 38 సంవత్సరాల 8 నెలలు. మహిళల విభాగంలో మొలా జుర్డెట్ మలోరీ 42 సంవత్సరాల 5 నెలల వయసులో టైటిల్ అందుకుంది. పురుషులు, మహిళల విభాగాల్లో టైటిల్ సాధించిన ఎక్కువ వయస్కులుగా వీరి పేర్లు కూడా రికార్డు పుస్తకాల్లో చేరాయి.

చిత్రం..జిమీ కానర్స్, క్రిస్ ఎవర్ట్ లాయిడ్