క్రీడాభూమి

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మూడో టెస్టు మరో రోజు ఆట వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 6: ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్‌ని వర్షం వెంటాడుతునే ఉంది. వరుసగా రెండో రోజు ఆట వర్షం కారణంగా వృథా అయింది. మొదటి రోజు ఆటను నిర్ణీత సమయానికి ముందుగానే నిలిపివేయగా, రెండో రోజు ఆటలో కేవలం 11.2 ఓవర్ల ఆట సాధ్యమైన విషయం తెలసిందే. అప్పటికి విండీస్ ఏడు వికెట్లకు 248 పరుగులు చేసగా, దనీష్ రాందీన్ (30), కెమర్ రోచ్ (0) నాటౌట్‌గా ఉన్నారు. మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. నాలుగో రోజైన బుధవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. వరుసగా రెండు మ్యాచ్‌లను గెల్చుకొని సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా మూడో టెస్టును కూడా సాధించడం ద్వారా క్లీన్‌స్వీప్‌ను అందుకోవాలని ఆశించింది. కానీ, దాదాపు మూడు రోజుల ఆట వృథా కావడంతో ఈ మ్యాచ్ డ్రా అవుతుందని స్పష్టమైంది.