క్రీడాభూమి

సంతృప్తినివ్వని గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 4: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరినప్పటికీ, మూడో రౌండ్ విజయం తనకు సంతృప్తినివ్వలేదని ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ వ్యాఖ్యానించింది. మూడో రౌండ్‌లో ఆమె లారా సీగ్మండ్‌ను 6-1, 6-2 తేడాతో చిత్తుచేసింది. ఒక గంట 19 నిమిషాలు సాగిన పోరులో కేవలం మూడు గేమ్స్‌ను కోల్పోయి విజయభేరి మోగించిన 36 ఏళ్ల వీనస్ మరింత మెరుగ్గా ఆడే సామర్థ్యం తనకు ఉందని అన్నది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆటలో నైపుణ్యం చాలా కీలకమని, ఈ కోణంలో తాను మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈసారి యుఎస్ ఓపెన్ టైటిల్ రేసులో తాను కూడా ఉన్నానని తెలిపింది.
ఇలావుంటే, వీసన్ సోదరి, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్‌లో అలవోకగా గెలిచింది. జొహన్నా లార్సన్‌ను ఢీకొన్న ఆమె 6-2, 6-1 ఆధిక్యంతో విజయం సాధించింది. కాగా, ఐదో సీడ్ సిమోనా హాలెప్ 6-1, 2-6, 6-4 స్కోరుతో టిమియా బబోస్‌ను ఓడించింది. కార్లా సౌరెజ్ నవరో 6-4, 6-3 తేడాతో ఎలెనా వెస్నినాపై గెలిచి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. నాలుగో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-2, 6-3 ఆధిక్యంతో కరోలినా గార్సియాపై విజయాన్ని నమోదు చేసింది. పదోసీడ్ కరోలినా ప్లిస్కోవా 6-2, 6-4 స్కోరుతో అనస్తాసియా పవ్లిచెన్కోపై గెలిచింది. అనా కొన్జూ కూడా ప్రీ క్వార్టర్స్ చేరింది. ఆమె మూడో రౌండ్‌లో వర్వరా లెప్చెన్కోను 6-3, 3-6, 6-2 ఆధిక్యంతో ఓడించింది.
మూడో రౌండ్‌కు సానియా
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మూడో రౌండ్ చేరింది. బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి అడుతున్న ఆమె రెండో రౌండ్‌లో విక్టోరిజా గొలబిక్, నికోల్ మెలిచర్ జోడీని 6-2, 7-5 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. వీరు మూడో రౌండ్‌లో నికోల్ గిబ్స్, నవో హిబినో జోడీతో తలపడతారు.
మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో గాబ్రియేల డబ్రోవ్‌స్కీ (కెనడా)తో కలిసి ఆడుతున్న రోహన్ బొపన్న రెండో రౌండ్‌లో లుకాజ్ కుబొట్, ఆండ్రియా హ్లావకొవా జోడీపై 5-7, 6-3, 10-7 తేడాతో విజయం సాధించాడు. బొపన్న, డబ్రోవ్‌స్కీ తమ తర్వాతి రౌండ్‌లో రాబర్ట్ ఫరా, అనా లెగా గ్రొన్‌ఫీల్డ్ జోడీని ఢీ కొంటారు.
పేస్, హింగిస్ జోడీ ఓటమి
మిక్స్‌డ్ డబుల్స్‌లో బొపన్న ముందంజ వేయగా, లియాండర్ పేస్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి బరిలోకి దిగిన అతను రెండో రౌండ్‌లో రాజీవ్ రామ్, కొకొ వాండెవాగె జోడీతో తలపడి, 6-7, 6-3, 11-13 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. పురుషుల డబుల్స్‌లో ఇప్పటికే ఓటమిపాలైన పేస్ మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ విఫలం కావడంతో అతని పోరాటానికి తెరపడింది.