క్రీడాభూమి

చెమటోడ్చిన ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 4: బ్రిటిష్ ఆటగాడు, ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో చెమటోడ్చి గెలిచాడు. పౌలో లోరెంజీతో తలపడిన అతను 7-6, 5-7, 6-2, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకొని మంచి ఫామ్‌లో ఉన్న ముర్రేకు లోరెంజీ నుంచి అనూహ్య స్థాయిలో పోటీ ఎదురైంది. మొదటి సెట్‌ను అతి కష్టం మీద తన ఖాతాలో వేసుకున్న ముర్రే రెండో సెట్‌లో పోరాడినా ఫలితం లేకపోయింది. మొదటి రెండు సెట్లలో ఇరువురు ఆటగాళ్లు సమవుజ్జీలుగా నిలవగా, చివరి రెండు సెట్లలో పుంజుకున్న ముర్రే తనదైన శైలిలో మ్యాచ్‌ని ముగించాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన జువాన్ మార్టిన్ డెల్ పొట్రో ప్రీ క్వార్టర్స్‌లో స్థానం సంపాదించాడు. మూడో రౌండ్‌లో అతను 11వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్‌పై 7-6, 6-2, 6-3 తేడాతో గెలిచాడు. 2009లో యుఎస్ ఓపెన్‌ను సాధించిన తర్వాత అతను తరచు గాయాల బారిన పడుతూ కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. జపాన్ ఆటగాడు కెయ్ నిషికోరి కూడా ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో అతను నికోలాస్ మాహుత్‌ను 4-6, 6-1, 6-2, 6-2 తేడాతో ఓడించాడు.
మారథాన్ మ్యాచ్
ఈఏడాది యుఎస్ ఓపెన్‌లో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా విజయభేరి మోగించాడు. మూడో రౌండ్‌లో డానియల్ ఇవాన్స్‌తో తలపడిన అతను 4-6, 6-3, 6-7, 7-6, 6-2 తేడాతో గెలిచాడు. ఇవాన్స్ ఓడినప్పటికీ, అద్వితీయ పోరాట పటిమను కనబరచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ నాలుగు గంటల, రెండు నిమిషాలు కొనసాగింది. యుఎస్ ఓపెన్‌లో సుదీర్ఘ మ్యాచ్ ఆడిన ఘనత మాత్రం మైఖేల్ చాంగ్, స్ట్ఫిన్ ఎడ్‌బర్గ్ పేరిట ఉంది. వీరు 1992లో జరిగిన సెమీఫైనల్‌లో ఐదు గంటల, 26
నిమిషాలు పోరాటం సాగించారు.