క్రీడాభూమి

క్రీడాకారుల్లో ఉత్తమ తండ్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, సెప్టెంబర్ 4: క్రీడాకారుల్లో ఈఏటి ఉత్తమ తండ్రిగా డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో చివరిదైన ఐదో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఫిలిప్స్ స్పోర్ట్స్ డాడ్ అవార్డును వార్నర్‌కు అందచేశారు. ఇదే ఏడాది ప్రారంభంలో అతనికి ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక అలాన్ బోర్డర్ అవార్డు లభించింది. తన ఇద్దరు కుమార్తెలు ఇవీ మయే, ఇండీ రయే ప్రభావం తనపై ఎక్కువగా ఉందని, ఫీల్డ్‌పైనా, వెలుపల కూడా తాను గతంలో మాదిరి దూకుడుగా ప్రవర్తించడం లేదని పలు సందర్భాల్లో వార్నర్ చెప్పాడు. భార్య కాండైస్‌ను కూడా అతను ఎన్నో ఇంటర్వ్యూల్లో ప్రశంసించాడు. భార్యాపిల్లలతో తాను ఎంతో సంతోషకమైన జీవితాన్ని గడుపుతున్నానని, తన కెరీర్‌పైన కూడా వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పాడు. కుమార్తెలంటే ఉన్న ఇష్టమే అతనికి స్పోర్ట్స్ డాడ్ అవార్డును సంపాదించిపెట్టింది.

భారత్ ‘ఎ’కు టైటిల్
మాకే (ఆస్ట్రేలియా), సెప్టెంబర్ 4: రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న భారత్ ‘ఎ’ జట్టు ఇక్కడ జరిగిన నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఫైనల్‌లో 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 266 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. మన్దీప్ సింగ్ 95, మనీష్ పాండే 61 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ 44.5 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. పీటర్ హాండ్స్‌కోమ్ 43 పరుగులు చేశాడు. అయితే, అతని ఒంటరి పోరాటానికి మిగతా ఆటగాళ్ల నుంచి మద్దతు లభించలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా ‘ఎ’కు ఓటమి తప్పలేదు. భారత ‘ఎ’ బౌలర్లలో యుజువేంద్ర చాహల్ 34 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి, ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.